(॥పల్లవి॥)
నానామహిమల శ్రీనారసింహము
పూని మమ్ము రక్షించీ పొగడెద నిదిగో
(॥నానా॥)
కొండవంటి వేదాద్రిగుహలలో సింహము
దండి భవనాశి యేటిదరి సింహము
అండ నారుశాస్త్రముల అడవిలో సింహము
నిండి అహోబలముపై నిక్కిచూచీ నదిగో
(॥నానా॥)
దిట్టయోగీంద్రుల మతితెర మఱఁగు సింహము
జట్టిగొన్న శ్రీసతితో జంటసింహము
పట్టి దైత్యుల వేఁటాడే బలుదీము సింహము
మెట్టి అహోబలముపై మెఱసీఁదా నదిగో
(॥నానా॥)
పలుదేవతల వెనుబలమైన సింహము
కెలసి కంబానఁ చెనఁగిన సింహము
అలరి శ్రీ వేంకటేశుఁ డైనట్టి సింహము
కొలువై అహోబలాన గురుతాయ నిదిగో
(||pallavi||)
nānāmahimala śhrīnārasiṁhamu
pūni mammu rakṣhiṁchī pŏgaḍĕda nidigo
(||nānā||)
kŏṁḍavaṁṭi vedādriguhalalo siṁhamu
daṁḍi bhavanāśhi yeḍidari siṁhamu
aṁḍa nāruśhāstramula aḍavilo siṁhamu
niṁḍi ahobalamubai nikkisūsī nadigo
(||nānā||)
diṭṭayogīṁdrula madidĕra maṟam̐gu siṁhamu
jaṭṭigŏnna śhrīsadido jaṁṭasiṁhamu
paṭṭi daityula vem̐ṭāḍe baludīmu siṁhamu
mĕṭṭi ahobalamubai mĕṟasīm̐dā nadigo
(||nānā||)
paludevadala vĕnubalamaina siṁhamu
kĕlasi kaṁbānam̐ sĕnam̐gina siṁhamu
alari śhrī veṁkaḍeśhum̐ ḍainaṭṭi siṁhamu
kŏluvai ahobalāna gurudāya nidigo