నానామార్గముల నాఁటుకొను నొకయోగి
(॥పల్లవి॥)
నానామార్గముల నాఁటుకొను నొకయోగి
మానిమీఁది తపసి సామన్యుఁ డాయోగి
(॥నానా॥)
పున్నమనమాసఁ గూడఁ బొదిగీ నొక్కొకయోగి
కన్నులచూపులు సరిగాఁ దూఁచు నొకయోగి
మిన్నునూయి చేఁతాటఁ జేఁది మెచ్చు మింగు నొకయోగి
వెన్న సన్నముగ నూరి వీఁగు నొకయోగి
(॥నానా॥)
గాలి ముడియగఁ గట్టి కలుగుడిగట్టు యోగి
నాలిమింటివిత్తు వెట్టి నగు నొకయోగి
మూలనిధానము గని ముందు గానఁ డొకయోగి
నేల దలకిందు సేసి నిక్కు నొకయోగి
(॥నానా॥)
గతజలములకెల్లఁ గట్టగట్టు నొకయోగి
తతిఁ బూవులమాటల దడిగట్టు యోగి
యితవైన శ్రీవేంకటేశుని మఱఁగు చొచ్చి
గతిగనే నాతఁ డొక్కడే యోగి
(||pallavi||)
nānāmārgamula nām̐ṭugŏnu nŏgayogi
mānimīm̐di tabasi sāmanyum̐ ḍāyogi
(||nānā||)
punnamanamāsam̐ gūḍam̐ bŏdigī nŏkkŏgayogi
kannulasūbulu sarigām̐ dūm̐su nŏgayogi
minnunūyi sem̐tāḍam̐ jem̐di mĕchchu miṁgu nŏgayogi
vĕnna sannamuga nūri vīm̐gu nŏgayogi
(||nānā||)
gāli muḍiyagam̐ gaṭṭi kaluguḍigaṭṭu yogi
nālimiṁṭivittu vĕṭṭi nagu nŏgayogi
mūlanidhānamu gani muṁdu gānam̐ ḍŏgayogi
nela dalagiṁdu sesi nikku nŏgayogi
(||nānā||)
gadajalamulagĕllam̐ gaṭṭagaṭṭu nŏgayogi
tadim̐ būvulamāḍala daḍigaṭṭu yogi
yidavaina śhrīveṁkaḍeśhuni maṟam̐gu sŏchchi
gadigane nādam̐ ḍŏkkaḍe yogi