నానా విధాల తను నే నమ్మినదాన
(॥పల్లవి॥)
నానా విధాల తను నే నమ్మినదాన
యే నెపమూ నెఱుఁగ నిదే విన్నవించరే
(॥॥)
యిందు వచ్చే ననఁ గాను యెదురు చూచు కున్నదాన
కందువ నుండు మనఁగాఁ గాచుకున్నదాన
అంది వుంగర మంపఁగా నాసతోడ నున్నదాన
ఇందు ముఖులాల పతి కిదే విన్నవించరే
(॥॥)
యెడమాట లాడించఁగా నిచ్చగించి వున్నదాన
పడఁతుల నంప్పఁగాను బత్తి నున్నదాన
అడరి యంతలో రాఁగా నానందాన నున్నదాన
యెడసి పాయఁగ నోప నిదే విన్నవించరే
(॥॥)
చేయి పట్టి పెనఁగఁగా సిగ్గుతోడ నున్నదాన
ఆయము లంటఁగా వెరగై వున్నదాన
వేయి విధముల శ్రీ వేంకటేశుఁడిదే కూడే
యే యెడ నెన్నటికి నిదే విన్నవించరే
(||pallavi||)
nānā vidhāla tanu ne namminadāna
ye nĕbamū nĕṟum̐ga nide vinnaviṁchare
(||||)
yiṁdu vachche nanam̐ gānu yĕduru sūsu kunnadāna
kaṁduva nuṁḍu manam̐gām̐ gāsugunnadāna
aṁdi vuṁgara maṁpam̐gā nāsadoḍa nunnadāna
iṁdu mukhulāla padi kide vinnaviṁchare
(||||)
yĕḍamāḍa lāḍiṁcham̐gā nichchagiṁchi vunnadāna
paḍam̐tula naṁppam̐gānu batti nunnadāna
aḍari yaṁtalo rām̐gā nānaṁdāna nunnadāna
yĕḍasi pāyam̐ga noba nide vinnaviṁchare
(||||)
seyi paṭṭi pĕnam̐gam̐gā siggudoḍa nunnadāna
āyamu laṁṭam̐gā vĕragai vunnadāna
veyi vidhamula śhrī veṁkaḍeśhum̐ḍide kūḍe
ye yĕḍa nĕnnaḍigi nide vinnaviṁchare