నాఁటికి నేఁటికి మీరె నవ్వరా నన్ను
(॥పల్లవి॥)
నాఁటికి నేఁటికి మీరె నవ్వరా నన్ను
మేఁటి జవ్వని మింతయై మించెఁగా నాకు
(॥నాఁటి॥)
చెలుల దూరఁగా నేమి చింతఁ బొరలఁగా నేమి
చెలఁగి నామోహ మింత సేసెఁగా నన్ను
బలిమి చూపఁగా నేమి పంతము లాడఁగా నేమి
నిలువునివ్వెరగులు నిండెఁగా నాకు
(॥నాఁటి॥)
పూరకె వుండఁగా నేమి వుస్సు రనఁగానేమి
తీరనితమి యిందుకుఁ దెచ్చెఁగా నన్ను
నేరుపరిఁ గాఁగా నేమి నే నెంతైనా నేమి
గారవపుముచ్చటలు గలిగెఁగా నాకు
(॥నాఁటి॥)
వేసరుకొనఁగా నేమి వేగు రుండగా నేమి
రేసు నాజవ్వన మింత రేఁచెఁగా నన్ను
ఆల శ్రీ వేంకటేశుఁడాతఁ డిట్టె నన్నుఁ గూడె
వాసు లెన్నైనా నేమి వన్నెగా నాకు
(||pallavi||)
nām̐ṭigi nem̐ṭigi mīrĕ navvarā nannu
mem̐ṭi javvani miṁtayai miṁchĕm̐gā nāgu
(||nām̐ṭi||)
sĕlula dūram̐gā nemi siṁtam̐ bŏralam̐gā nemi
sĕlam̐gi nāmoha miṁta sesĕm̐gā nannu
balimi sūbam̐gā nemi paṁtamu lāḍam̐gā nemi
niluvunivvĕragulu niṁḍĕm̐gā nāgu
(||nām̐ṭi||)
pūragĕ vuṁḍam̐gā nemi vussu ranam̐gānemi
tīranidami yiṁdugum̐ dĕchchĕm̐gā nannu
nerubarim̐ gām̐gā nemi ne nĕṁtainā nemi
gāravabumuchchaḍalu galigĕm̐gā nāgu
(||nām̐ṭi||)
vesarugŏnam̐gā nemi vegu ruṁḍagā nemi
resu nājavvana miṁta rem̐sĕm̐gā nannu
āla śhrī veṁkaḍeśhum̐ḍādam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
vāsu lĕnnainā nemi vannĕgā nāgu