(॥పల్లవి॥)
నాఁటికి మరి నను నగరాదా
గీఁటి కన్ను మఱి గిఱుపఁగరాదా
(॥నాఁటి॥)
మలసి నీకు నే మనవులు చెప్పిన
నలుగడ నీవే నగరాదా
వలపు చల్లి యిఁక వడి నినుఁ గొసరిన
నిలువుకు నీవే నిలుగఁగరాదా
(॥నాఁటి॥)
కనుఁగొనలఁ జూచి కాఁకలు చల్లిన
నను నీ వప్పుడు నగరాదా
తనియక నే నిను తగవు లడిగినను
కినిసి బొమ్మల జంకించఁగరాదా
(॥నాఁటి॥)
వేమరు రతులకు వెనకతీసినను
నా మొగము చూచి నగరాదా
గామిడి శ్రీవేంకటపతివి నీవు
కామించి కూడితి కానీరాదా
(||pallavi||)
nām̐ṭigi mari nanu nagarādā
gīm̐ṭi kannu maṟi giṟubam̐garādā
(||nām̐ṭi||)
malasi nīgu ne manavulu sĕppina
nalugaḍa nīve nagarādā
valabu salli yim̐ka vaḍi ninum̐ gŏsarina
niluvugu nīve nilugam̐garādā
(||nām̐ṭi||)
kanum̐gŏnalam̐ jūsi kām̐kalu sallina
nanu nī vappuḍu nagarādā
taniyaga ne ninu tagavu laḍiginanu
kinisi bŏmmala jaṁkiṁcham̐garādā
(||nām̐ṭi||)
vemaru radulagu vĕnagadīsinanu
nā mŏgamu sūsi nagarādā
gāmiḍi śhrīveṁkaḍabadivi nīvu
kāmiṁchi kūḍidi kānīrādā