Naamti valabulu nemdu naanam bettevaa

నాఁటి వలపులు నేఁడు నానఁ బెట్టేవా
Language

(॥పల్లవి॥)
నాఁటి వలపులు నేఁడు నానఁ బెట్టేవా
వాఁటమాయ నీ సుద్దులు వంక లొత్తవలెనా

(॥నాఁటి॥)
నిన్ను నేమి ననము నీతో సరస మాడము
యెన్నటిపొందులు మాతో నేల నవ్వేవు
సన్నలనే మొక్కితిమి చాయల దీవించితివి
కిన్నెరమీట్ల నింకా గిలిగించవలెనా

(॥నాఁటి॥)
ననుపువారము గాము నవ్వింపించుకో రాదు
పనిలేనిపని యేల పట్టి తీసేవు
తనీసితిమి మాలోనే తారుకాణ వచ్చె నీకు
ఘనముగాఁ బాట వాడి కాఁక రేఁచవలెనా

(॥నాఁటి॥)
సమ్మతించ లేదు నేము చవులు పుట్టించ రాము
కమ్మరఁ గమ్మర నేల కాఁగిలించేవు
యిమ్ముల శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడితివి
చిమ్ముచు నేకతా లాడి సిగ్గు రేఁచవలెనా

(||pallavi||)
nām̐ṭi valabulu nem̐ḍu nānam̐ bĕṭṭevā
vām̐ṭamāya nī suddulu vaṁka lŏttavalĕnā

(||nām̐ṭi||)
ninnu nemi nanamu nīdo sarasa māḍamu
yĕnnaḍibŏṁdulu mādo nela navvevu
sannalane mŏkkidimi sāyala dīviṁchidivi
kinnĕramīṭla niṁkā giligiṁchavalĕnā

(||nām̐ṭi||)
nanubuvāramu gāmu navviṁpiṁchugo rādu
panilenibani yela paṭṭi tīsevu
tanīsidimi mālone tārugāṇa vachchĕ nīgu
ghanamugām̐ bāḍa vāḍi kām̐ka rem̐savalĕnā

(||nām̐ṭi||)
sammadiṁcha ledu nemu savulu puṭṭiṁcha rāmu
kammaram̐ gammara nela kām̐giliṁchevu
yimmula śhrī veṁkaḍeśha yīḍa nannum̐ gūḍidivi
simmusu negadā lāḍi siggu rem̐savalĕnā