Naamogamu soosi yemtanavvevu neevu

నామొగము చూచి యెంతనవ్వేవు నీవు
Language

(॥పల్లవి॥)
నామొగము చూచి యెంతనవ్వేవు నీవు
కామినిచేఁత లెల్లాఁ గనుఁగొనరాదా

(॥నామొ॥)
పన్నుక వినయాలెల్లా పచారించుకొని నీకు
విన్నపాలు సేసీ నాకె వినరాదా
చన్నులమీఁది పయ్యద జారఁ దోసుకొంటాను
సన్నలనే మోవిచూపీఁ జవిగొనరాదా

(॥నామొ॥)
అతివేడుకతోడుత అట్టె వేళగాచుకొని
సతి పాదాలొత్తవచ్చీఁ జాఁచరాదా
మతిఁ దలపోసుకొంటా మర్మములు గరఁగఁగ
రతులకు నాసవడీ రారాదా లోనికీ

(॥నామొ॥)
గుట్టుతోడఁ దమకము గుబ్బతిలు కొనఁగాను
అట్టె నీకు విడెమిచ్చీ నందుకోరాదా
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
చుట్టమాయఁ డానూ దయఁ జూడఁగరాదా

(||pallavi||)
nāmŏgamu sūsi yĕṁtanavvevu nīvu
kāminisem̐ta lĕllām̐ ganum̐gŏnarādā

(||nāmŏ||)
pannuga vinayālĕllā pasāriṁchugŏni nīgu
vinnabālu sesī nāgĕ vinarādā
sannulamīm̐di payyada jāram̐ dosugŏṁṭānu
sannalane movisūbīm̐ javigŏnarādā

(||nāmŏ||)
adiveḍugadoḍuda aṭṭĕ veḽagāsugŏni
sadi pādālŏttavachchīm̐ jām̐sarādā
madim̐ dalabosugŏṁṭā marmamulu garam̐gam̐ga
radulagu nāsavaḍī rārādā lonigī

(||nāmŏ||)
guṭṭudoḍam̐ damagamu gubbadilu kŏnam̐gānu
aṭṭĕ nīgu viḍĕmichchī naṁdugorādā
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
suṭṭamāyam̐ ḍānū dayam̐ jūḍam̐garādā