(॥పల్లవి॥)
నామేనే యెంతసేసె నాయెడకు
కామించి కడవారు గాఁబోయేరా
(॥నామే॥)
యెవ్వరి నేమనలేక ఇందరుఁ జూడఁగానే
జవ్వసభారముచేత జడియఁగానే
పువ్వకపూచినయట్టు పులకజొంపము మేనఁ
గువ్వనిపేరులవలె గుదిగోనీనే
(॥నామే॥)
ఇన్నియు నోరుచుకొని ఇంతుల దూరఁగలేక
కన్నులపెట్టె పొద్దు గడపఁగను
వున్నరీతినే వుండి వొట్టినచూపులు నాకు
పున్నమ వెన్నెల నీడై పొందు వచ్చీనే
(॥నామే॥)
చక్కఁదనములన్నియఁ జవిచేసుకొనీనే
చెక్కిటిచేతితోడఁ జింతించఁగా
యిక్కడనె శ్రీవేంకటేశుఁడు గూడఁగాను
మక్కున సరవశాన మఱపాయెనే
(||pallavi||)
nāmene yĕṁtasesĕ nāyĕḍagu
kāmiṁchi kaḍavāru gām̐boyerā
(||nāme||)
yĕvvari nemanalega iṁdarum̐ jūḍam̐gāne
javvasabhāramuseda jaḍiyam̐gāne
puvvagabūsinayaṭṭu pulagajŏṁpamu menam̐
guvvaniberulavalĕ gudigonīne
(||nāme||)
inniyu norusugŏni iṁtula dūram̐galega
kannulabĕṭṭĕ pŏddu gaḍabam̐ganu
vunnarīdine vuṁḍi vŏṭṭinasūbulu nāgu
punnama vĕnnĕla nīḍai pŏṁdu vachchīne
(||nāme||)
sakkam̐danamulanniyam̐ javisesugŏnīne
sĕkkiḍisedidoḍam̐ jiṁtiṁcham̐gā
yikkaḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐gānu
makkuna saravaśhāna maṟabāyĕne