Naamde yeṟumgudumu nee nadanalellaa

నాఁడే యెఱుఁగుదుము నీ నటనలెల్లా
Language

(॥పల్లవి॥)
నాఁడే యెఱుఁగుదుము నీ నటనలెల్లా
పోఁడిమితో మేలు మమ్ము పొసఁగితి విపుడు

(॥నాఁడే॥)
యెంత సింగారించుకొంటి వేతరిఁడవు
కాంతలఁ గంటేఁ జాలు కాతరీఁడవు
పంతాన మమ్మేల యింత పచ్చిసేసేవు
వింతలా నేఁడు మాకు నీవిద్య లెల్లాను

(॥నాఁడే॥)
సరసపు మాటల సటకాఁడవు
మరుతంత్రముల యలమటకాఁడవు
చెరుఁగువట్టి నన్నెంత చెనకేవు
సొరది విన్నవేకా నీసుద్దులెల్లాను

(॥నాఁడే॥)
తనివోని వలపుల దాయఁగాడవు
ననిచి వొడఁబాటుల నాయగాఁడవు
యెనసితివి శ్రీవేంకటేశుఁడ నన్ను
పెనగొనెఁగా నీ పెద్దరికాలెల్లాను

(||pallavi||)
nām̐ḍe yĕṟum̐gudumu nī naḍanalĕllā
pom̐ḍimido melu mammu pŏsam̐gidi vibuḍu

(||nām̐ḍe||)
yĕṁta siṁgāriṁchugŏṁṭi vedarim̐ḍavu
kāṁtalam̐ gaṁṭem̐ jālu kādarīm̐ḍavu
paṁtāna mammela yiṁta pachchisesevu
viṁtalā nem̐ḍu māgu nīvidya lĕllānu

(||nām̐ḍe||)
sarasabu māḍala saḍagām̐ḍavu
marudaṁtramula yalamaḍagām̐ḍavu
sĕrum̐guvaṭṭi nannĕṁta sĕnagevu
sŏradi vinnavegā nīsuddulĕllānu

(||nām̐ḍe||)
tanivoni valabula dāyam̐gāḍavu
nanisi vŏḍam̐bāḍula nāyagām̐ḍavu
yĕnasidivi śhrīveṁkaḍeśhum̐ḍa nannu
pĕnagŏnĕm̐gā nī pĕddarigālĕllānu