నాఁడే నీవిచ్చిన బాస నమ్మి వున్నారము నేము
(॥పల్లవి॥)
నాఁడే నీవిచ్చిన బాస నమ్మి వున్నారము నేము
పోఁడిమిఁ దలచవయ్య పొంతనే మా సేవలు
(॥॥)
పఱపుపైఁ బవళించి పడఁతి విడె మియ్యఁగ
నెరిసరసము గడునిండా నాడేవు
యెఱుకతో సంతోసాల నెంతపరాకై నాఁగద్దు
మఱవకురయ్య మాపై మన్నన లెప్పుడును
(॥॥)
గద్దెమీఁదఁ గూచుండి గందము నీకుఁ బూయఁగ
వొద్దిక నాపెతోడ నవ్వులు నవ్వేవు
కొద్దిలేనివలపులు కోటానఁగోటులు మీకు
సుద్దులు దలఁచి దయఁజూడవయ్య మమ్మును
(॥॥)
కొలువులోనిలుచుండి కూరిమి నీపైఁ జల్లఁగా
అలమేలు మంగ నురమందు నించేవు
తొలుతె శ్రీ వెంకటేశ దొరసితి రిద్దరును
అలరి మమ్మేలి మాయంకల రాఁగదవయ్య
(||pallavi||)
nām̐ḍe nīvichchina bāsa nammi vunnāramu nemu
pom̐ḍimim̐ dalasavayya pŏṁtane mā sevalu
(||||)
paṟabubaim̐ bavaḽiṁchi paḍam̐ti viḍĕ miyyam̐ga
nĕrisarasamu gaḍuniṁḍā nāḍevu
yĕṟugado saṁtosāla nĕṁtabarāgai nām̐gaddu
maṟavagurayya mābai mannana lĕppuḍunu
(||||)
gaddĕmīm̐dam̐ gūsuṁḍi gaṁdamu nīgum̐ būyam̐ga
vŏddiga nābĕdoḍa navvulu navvevu
kŏddilenivalabulu koḍānam̐goḍulu mīgu
suddulu dalam̐si dayam̐jūḍavayya mammunu
(||||)
kŏluvulonilusuṁḍi kūrimi nībaim̐ jallam̐gā
alamelu maṁga nuramaṁdu niṁchevu
tŏludĕ śhrī vĕṁkaḍeśha dŏrasidi riddarunu
alari mammeli māyaṁkala rām̐gadavayya