నాఁడే కన్నదిగాదా నవ్వేఁగాక
(॥పల్లవి॥)
నాఁడే కన్నదిగాదా నవ్వేఁగాక
నేఁడు నిన్నాడఁగఁబోతే నేర మింతేకాక
(॥నాఁడే॥)
మనసు వచ్చినఁగాక మాటలు విన నింపౌనా
పనిమాలినట్టి వట్టి పరాకేకాక
యెనసి వుండినఁ గాక యేకతము లింపౌనా
తనివోని దానఁ గాన దగ్గరేఁగాక
(॥నాఁడే॥)
యిచ్చ గలినఁ గాక యింటికిరా నింపౌనా
పెచ్చు పెరిగి వూరకే పిలిచేఁగాక
నిచ్చఁ గూడుండినఁగాక నెయ్యములు సతమవునా
పచ్చిసేసి నిన్నుఁ గడుఁ బైకొనేఁగాక
(॥నాఁడే॥)
కాఁకలు రేఁగినఁగాక కన్నులఁ జూడనింపౌనా
తాఁకు మాఁకెఱఁగక వాతప్పితిఁ గాక
యేఁకట శ్రీవేంకటేశ యెఱిఁగి కూడితివిట్టె
తేఁకువ యిదేకాదా తెలియలేఁగాక
(||pallavi||)
nām̐ḍe kannadigādā navvem̐gāga
nem̐ḍu ninnāḍam̐gam̐bode nera miṁtegāga
(||nām̐ḍe||)
manasu vachchinam̐gāga māḍalu vina niṁpaunā
panimālinaṭṭi vaṭṭi parāgegāga
yĕnasi vuṁḍinam̐ gāga yegadamu liṁpaunā
tanivoni dānam̐ gāna daggarem̐gāga
(||nām̐ḍe||)
yichcha galinam̐ gāga yiṁṭigirā niṁpaunā
pĕchchu pĕrigi vūrage pilisem̐gāga
nichcham̐ gūḍuṁḍinam̐gāga nĕyyamulu sadamavunā
pachchisesi ninnum̐ gaḍum̐ baigŏnem̐gāga
(||nām̐ḍe||)
kām̐kalu rem̐ginam̐gāga kannulam̐ jūḍaniṁpaunā
tām̐ku mām̐kĕṟam̐gaga vādappidim̐ gāga
yem̐kaḍa śhrīveṁkaḍeśha yĕṟim̐gi kūḍidiviṭṭĕ
tem̐kuva yidegādā tĕliyalem̐gāga