Naamanasu vegirimchee naagamtenu

నామనసు వేగిరించీ నాకంటేను
Language

(॥పల్లవి॥)
నామనసు వేగిరించీ నాకంటేను
తామసించఁ బని లేదు తమకించీ వయసు

(॥నామన॥)
పోయి వచ్చి తటె నేఁ బొమ్మన్న చోటికి నీవు
ఆయనా ఆపని నే నన్నట్లనే
మాయలు గావు గదా మన సొక్క టాయనా
యీయెడకు నీవెంటే యిప్పు డిట్టె వచ్చెనా

(॥నామన॥)
వేలఁ దగిలించుకొన్న వింతలేక యెక్కడిదే
మేలుసుద్ది నీమొకాన మించీ నదే
వాలుకరెప్పలకొన వంచి సన్న సేసేవు
లోలో మాటాడుదము లోనికి రాఁ గదవే

(॥నామన॥)
యేఁటికి నవ్వేవే నీవు యెంచినట్టే ఆయనా
చాటువ నదియ నా సంతోషము
యీటున శ్రీవెంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
పాటించి తా నే మనీనె పంతము లీడెరెనూ

(||pallavi||)
nāmanasu vegiriṁchī nāgaṁṭenu
tāmasiṁcham̐ bani ledu tamagiṁchī vayasu

(||nāmana||)
poyi vachchi taḍĕ nem̐ bŏmmanna soḍigi nīvu
āyanā ābani ne nannaṭlane
māyalu gāvu gadā mana sŏkka ṭāyanā
yīyĕḍagu nīvĕṁṭe yippu ḍiṭṭĕ vachchĕnā

(||nāmana||)
velam̐ dagiliṁchugŏnna viṁtalega yĕkkaḍide
melusuddi nīmŏgāna miṁchī nade
vālugarĕppalagŏna vaṁchi sanna sesevu
lolo māḍāḍudamu lonigi rām̐ gadave

(||nāmana||)
yem̐ṭigi navveve nīvu yĕṁchinaṭṭe āyanā
sāḍuva nadiya nā saṁtoṣhamu
yīḍuna śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍĕ
pāḍiṁchi tā ne manīnĕ paṁtamu līḍĕrĕnū