Naamaada vinavayya naadagamela sesevu

నామాట వినవయ్య నాటకమేల సేసేవు
Language

(॥పల్లవి॥)
నామాట వినవయ్య నాటకమేల సేసేవు
వేమారు నింతేసి నీకు విన్నవించఁగలమా

(॥నావ॥)
కోపము నీకుఁ దగదు కోమలిమీఁదట: నీవు
తీపుచల్లి వలపించి తెచ్చుకొంటివి
ఆపె నిన్ను నేమనినా నందుకు నవ్వఁగవలె
వోపనంటేఁబోవునా వొగి మగవాఁడవు

(॥నావ॥)
మంకులు నీకుఁదగదు: మానినికిఁ దొలుతే
వుంకువగా నిచ్చితివి వుంగరము
సంకెలేక యాపె నిన్ను జరసితే మొచ్చవలె
కొంక నిఁకఁ దీరునా కొండవంటిదొరవు

(॥నావ॥)
వేసట నీకుఁ గూడదు వెలఁదికాఁగిట నీవు
యీసుదీర శ్రీ వేంకటేశ కూడితి
ఆసలు నాపె నిన్ను ఆఱడెంతసేసినా
వాసులు నీ కమరపు వలచిన జాణవు

(||pallavi||)
nāmāḍa vinavayya nāḍagamela sesevu
vemāru niṁtesi nīgu vinnaviṁcham̐galamā

(||nāva||)
kobamu nīgum̐ dagadu komalimīm̐daḍa: nīvu
tībusalli valabiṁchi tĕchchugŏṁṭivi
ābĕ ninnu nemaninā naṁdugu navvam̐gavalĕ
vobanaṁṭem̐bovunā vŏgi magavām̐ḍavu

(||nāva||)
maṁkulu nīgum̐dagadu: māninigim̐ dŏlude
vuṁkuvagā nichchidivi vuṁgaramu
saṁkĕlega yābĕ ninnu jaraside mŏchchavalĕ
kŏṁka nim̐kam̐ dīrunā kŏṁḍavaṁṭidŏravu

(||nāva||)
vesaḍa nīgum̐ gūḍadu vĕlam̐digām̐giḍa nīvu
yīsudīra śhrī veṁkaḍeśha kūḍidi
āsalu nābĕ ninnu āṟaḍĕṁtasesinā
vāsulu nī kamarabu valasina jāṇavu