నాలోని వేడుకలు నా మనసే యెఱుఁగును
(॥పల్లవి॥)
నాలోని వేడుకలు నా మనసే యెఱుఁగును
కేలెత్తి తన కిట్టే మొక్కితి నే ననవే
(॥॥)
వొడఁ బరచ నేరుచు వొద్దికై వుండఁగలఁడు
చిడిముడిఁ బతికిఁకఁ జెప్పే దేమే
అడియాలా లిచ్చి నాఁడు అన్నిటా మన్నించినాఁడు
తడవనున్న పనులు తానే యెఱుఁగునే
(॥॥)
తను నిట్టే మరిగించె తమకమునాకు రేఁచె
చెనకి యింకా వేరే చెప్పేదేమే
మన సొక్కటిగాఁ జెసె మంతనానఁ జస విచ్చె
తనిసితిఁ గోరికల తానే యెఱుఁగునే
(॥॥)
గ నాకు నేర్పె కమ్మి నావద్ద నున్నాఁడు
చెలికత్తెలాల మరి చెప్పేదేమే
అలమేలుమంగను తా నదె శ్రీ వేంకటేశుఁడు
తలపులోఁ బాయఁడు తానే యెఱుఁగునే
(||pallavi||)
nāloni veḍugalu nā manase yĕṟum̐gunu
kelĕtti tana kiṭṭe mŏkkidi ne nanave
(||||)
vŏḍam̐ barasa nerusu vŏddigai vuṁḍam̐galam̐ḍu
siḍimuḍim̐ badigim̐kam̐ jĕppe deme
aḍiyālā lichchi nām̐ḍu anniḍā manniṁchinām̐ḍu
taḍavanunna panulu tāne yĕṟum̐gune
(||||)
tanu niṭṭe marigiṁchĕ tamagamunāgu rem̐sĕ
sĕnagi yiṁkā vere sĕppedeme
mana sŏkkaḍigām̐ jĕsĕ maṁtanānam̐ jasa vichchĕ
tanisidim̐ gorigala tāne yĕṟum̐gune
(||||)
ga nāgu nerbĕ kammi nāvadda nunnām̐ḍu
sĕligattĕlāla mari sĕppedeme
alamelumaṁganu tā nadĕ śhrī veṁkaḍeśhum̐ḍu
talabulom̐ bāyam̐ḍu tāne yĕṟum̐gune