Naalone nee vunnaamdavu nannela bhramayimchevu

నాలోనే నీ వున్నాఁడవు నన్నేల భ్రమయించేవు
Language

(॥పల్లవి॥)
నాలోనే నీ వున్నాఁడవు నన్నేల భ్రమయించేవు
యీ లీల చూచి మఱపై యిటువలె నున్నది

(॥నాలో॥)
దైవమా నిన్నెఱఁగుదు తప్పక కొలువ నోప
భావించుకొందు ధర్మము పట్టగ నోప
కావలెనందు విరక్తి కడకూ నడప నోప
కావరానఁ బగలు చీఁకటి దవ్వేమిటిదో

(॥నాలో॥)
యెఱుఁగుదు సుజ్ఞాన మిట్టే మదిలో నుండదు
వెఱతు సంసార మట్టే విడువలేను
మఱవను నీపై భక్తి మట్టుపెట్టరాదు బుద్ధి
తఱిలో నీటిలో నుండే దప్పిగొనే మిదివో

(॥నాలో॥)
చదువుదు శాస్త్రములు సార మందు గ్రహించను
వెదకుదు మోక్షచింత విస్తరించను
యెదుట శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
సదరానఁబైఁడికి వాసన వచ్చె నిదివో

(||pallavi||)
nālone nī vunnām̐ḍavu nannela bhramayiṁchevu
yī līla sūsi maṟabai yiḍuvalĕ nunnadi

(||nālo||)
daivamā ninnĕṟam̐gudu tappaga kŏluva noba
bhāviṁchugŏṁdu dharmamu paṭṭaga noba
kāvalĕnaṁdu virakti kaḍagū naḍaba noba
kāvarānam̐ bagalu sīm̐kaḍi davvemiḍido

(||nālo||)
yĕṟum̐gudu sujñāna miṭṭe madilo nuṁḍadu
vĕṟadu saṁsāra maṭṭe viḍuvalenu
maṟavanu nībai bhakti maṭṭubĕṭṭarādu buddhi
taṟilo nīḍilo nuṁḍe dappigŏne midivo

(||nālo||)
saduvudu śhāstramulu sāra maṁdu grahiṁchanu
vĕdagudu mokṣhasiṁta vistariṁchanu
yĕduḍa śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
sadarānam̐baim̐ḍigi vāsana vachchĕ nidivo