నాలిసేయ నేమిటికి నాతో నీవు
(॥పల్లవి॥)
నాలిసేయ నేమిటికి నాతో నీవు
ఆలరి తనములేల ఆనతియ్యరాదా
(॥నాలి॥)
చేతులెత్తి మొక్కఁగాను చిటికనవేలు వట్టి
పాతురాడించిన యట్టు పట్టి తీసేవు
యేతులకు నీచేఁత యెట్టు వలసినా వచ్చు
ఆతుమలోపలిమాట ఆనతియ్యరాదా
(॥నాలి॥)
కానుక నే నియ్యఁగాను గక్కున నా కొంగు వట్టి
సానదిప్పినట్లు దిప్పి సాము సే సేవు
అనుకొన్న యీ నటన లన్నిటికిఁ బొత్తేవుండు
ఐన దయ్యీఁగాని నిజ మానతియ్యరాదా
(॥నాలి॥)
పాదాలు నేఁ బిసుకఁగా పైకొని కాఁగిటఁ బట్టి
సేదదేర నన్నుఁగూడి చెక్కు నొక్కేవు
యీదెస శ్రీ వేంకటేశ యిది గుమిత మార్గము
ఆదరించి నీ గుట్టు నా కానతియ్యరాదా
(||pallavi||)
nāliseya nemiḍigi nādo nīvu
ālari tanamulela ānadiyyarādā
(||nāli||)
sedulĕtti mŏkkam̐gānu siḍiganavelu vaṭṭi
pādurāḍiṁchina yaṭṭu paṭṭi tīsevu
yedulagu nīsem̐ta yĕṭṭu valasinā vachchu
ādumalobalimāḍa ānadiyyarādā
(||nāli||)
kānuga ne niyyam̐gānu gakkuna nā kŏṁgu vaṭṭi
sānadippinaṭlu dippi sāmu se sevu
anugŏnna yī naḍana lanniḍigim̐ bŏttevuṁḍu
aina dayyīm̐gāni nija mānadiyyarādā
(||nāli||)
pādālu nem̐ bisugam̐gā paigŏni kām̐giḍam̐ baṭṭi
sedadera nannum̐gūḍi sĕkku nŏkkevu
yīdĕsa śhrī veṁkaḍeśha yidi gumida mārgamu
ādariṁchi nī guṭṭu nā kānadiyyarādā