నాలికాఁడ నీవు నాతో నవ్వులేలరా నీ
(॥పల్లవి॥)
నాలికాఁడ నీవు నాతో నవ్వులేలరా నీ-
వేలి సన్నలకే నేను వెర గౌదునటరా
(॥నాలి॥)
తత్తరించి నే నిన్ను తగులనాడినమాటఁ
కుత్తర మియ్యక యేరా వున్నాఁడవు
కొత్తవారిఁ బాఁతవారిఁ గడకట్టి నీవు వట్టిఁ
పొత్తు గలసితే నిన్నుఁ బోనిత్తునటరా
(॥నాలి॥)
కొసరి కొసరి నీగురుతు చూచేమంటే
ముసుగు వెట్టుక యేరా మోము చూడవు
వెసఁ దీవు పులుసును వేరేవొక్కటిలోఁ బెట్టి
యెస రెత్తుకున్నాఁడవు యెరఁగ నే నటరా
(॥నాలి॥)
ముందర వెనక నీకు మొక్కులు నే మొక్కఁగాను
గొందినే నీ వది యేరా గుట్టు సేసేవు
అందుక శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
పందెమాడి నియ్యానకు భ్రమసితి నటరా
(||pallavi||)
nāligām̐ḍa nīvu nādo navvulelarā nī-
veli sannalage nenu vĕra gaudunaḍarā
(||nāli||)
tattariṁchi ne ninnu tagulanāḍinamāḍam̐
kuttara miyyaga yerā vunnām̐ḍavu
kŏttavārim̐ bām̐tavārim̐ gaḍagaṭṭi nīvu vaṭṭim̐
pŏttu galaside ninnum̐ bonittunaḍarā
(||nāli||)
kŏsari kŏsari nīgurudu sūsemaṁṭe
musugu vĕṭṭuga yerā momu sūḍavu
vĕsam̐ dīvu pulusunu verevŏkkaḍilom̐ bĕṭṭi
yĕsa rĕttugunnām̐ḍavu yĕram̐ga ne naḍarā
(||nāli||)
muṁdara vĕnaga nīgu mŏkkulu ne mŏkkam̐gānu
gŏṁdine nī vadi yerā guṭṭu sesevu
aṁduga śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
paṁdĕmāḍi niyyānagu bhramasidi naḍarā