Naaligaam dimtulalaagu naamderamgamdaa

నాలికాఁ డింతులలాగు నాఁడెరఁగఁడా
Language

(॥పల్లవి॥)
నాలికాఁ డింతులలాగు నాఁడెరఁగఁడా
మేలుతోనే కిందట మీఁదటకాఁ గాక

(॥నాలి॥)
చనవిచ్చినట్టివాఁడు సతినేల తాఁదిట్టె
పెనఁగి యేమి సేసినాఁ బ్రియమె కాక
ననుపు గలుగువాఁడు నవ్వితే నెగ్గేలపట్టె
గునియక అట్టె వోర్చుకొనుఁగాక

(॥నాలి॥)
మచ్చిక గలుగువాఁడు మారుమాట లేలాడే
కొచ్చి యేమాడినా నియ్యకొనుఁ గాక
పచ్చిగా వలచువాఁడు పంతా లేఁటికిఁ జూపె
యిచ్చకములే నెరపి యెనయుఁగాక

(॥నాలి॥)
పొదిగి కూడినవాఁడు బొమ్మలనేల జంకించె
కదిసినరతులెల్లాఁ గైకొనుఁగాక
యిదివో శ్రీ వేంకటేశుఁ డిప్పుడేఁటికిఁ బదరె
యెదపై నాపెఁ బెట్టుక యిల యేలుఁగాక

(||pallavi||)
nāligām̐ ḍiṁtulalāgu nām̐ḍĕram̐gam̐ḍā
meludone kiṁdaḍa mīm̐daḍagām̐ gāga

(||nāli||)
sanavichchinaṭṭivām̐ḍu sadinela tām̐diṭṭĕ
pĕnam̐gi yemi sesinām̐ briyamĕ kāga
nanubu galuguvām̐ḍu navvide nĕggelabaṭṭĕ
guniyaga aṭṭĕ vorsugŏnum̐gāga

(||nāli||)
machchiga galuguvām̐ḍu mārumāḍa lelāḍe
kŏchchi yemāḍinā niyyagŏnum̐ gāga
pachchigā valasuvām̐ḍu paṁtā lem̐ṭigim̐ jūbĕ
yichchagamule nĕrabi yĕnayum̐gāga

(||nāli||)
pŏdigi kūḍinavām̐ḍu bŏmmalanela jaṁkiṁchĕ
kadisinaradulĕllām̐ gaigŏnum̐gāga
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍippuḍem̐ṭigim̐ badarĕ
yĕdabai nābĕm̐ bĕṭṭuga yila yelum̐gāga