నాగుణాలు దలఁచక నీగుణాలే తలఁచుకో
(॥పల్లవి॥)
నాగుణాలు దలఁచక నీగుణాలే తలఁచుకో
యే గతినీ మానరాదు యింకనైనాను
(॥నాగు॥)
తెచ్చి నా గురుఁడు నిన్ను తిరువారాధన సేయ
నిచ్చినాఁడు తలఁచుకో యింకనైనాను
అచ్చుమోపి దాసునిఁగా నంగవించిరి నీ దాసు
లిచ్చల నన్నుఁ జేపట్టు మిందులకు నైననాను
(॥నాగు॥)
శరణాగతరక్షణ చాటితి నీ భక్తులకుఁగా
యిరవుగాఁ దలఁచుకో యిదియైనాను
తిరుమంత్రమే నన్నుఁ దెచ్చి నీ సొమ్ముగఁ జేసె
యెరవు లేక కాచుకో యిందులకైనాను
(॥నాగు॥)
యిట్టె అభయ హస్త మెత్తితి వెవ్వరికిఁగా
యెట్టనెదుటఁ దలఁచు మిదియైనాను
గట్టిగా శ్రీ వేంకటేశ కడు నీ నాస మందమే
యెట్టయినాఁ దలఁచుకో యింకనైనాను
(||pallavi||)
nāguṇālu dalam̐saga nīguṇāle talam̐sugo
ye gadinī mānarādu yiṁkanainānu
(||nāgu||)
tĕchchi nā gurum̐ḍu ninnu tiruvārādhana seya
nichchinām̐ḍu talam̐sugo yiṁkanainānu
achchumobi dāsunim̐gā naṁgaviṁchiri nī dāsu
lichchala nannum̐ jebaṭṭu miṁdulagu nainanānu
(||nāgu||)
śharaṇāgadarakṣhaṇa sāḍidi nī bhaktulagum̐gā
yiravugām̐ dalam̐sugo yidiyainānu
tirumaṁtrame nannum̐ dĕchchi nī sŏmmugam̐ jesĕ
yĕravu lega kāsugo yiṁdulagainānu
(||nāgu||)
yiṭṭĕ abhaya hasta mĕttidi vĕvvarigim̐gā
yĕṭṭanĕduḍam̐ dalam̐su midiyainānu
gaṭṭigā śhrī veṁkaḍeśha kaḍu nī nāsa maṁdame
yĕṭṭayinām̐ dalam̐sugo yiṁkanainānu