Naagum jesinadi yellaa naduma neede kaadaa

నాకుఁ జేసినది యెల్లా నడుమ నీదే కాదా
Language

(॥పల్లవి॥)
నాకుఁ జేసినది యెల్లా నడుమ నీదే కాదా
దాకొని యిన్నియును నేఁడు తారుకాణలాయఁగా

(॥॥)
కందువ నీవిరహగ్నిఁ గాఁగినట్టినా మేను
యిందు నీకాఁగిటికి నెక్కెఁగా నేఁడు
అంది కడువేఁడిగాఁగా నలిగి చూచినచూపు
సందడి నీకూటములో చల్లువెదలాయఁగా

(॥॥)
తెగి నీతో వాదడచి తిట్టుకొన్నయీనోరే
నగి నీతో మాటలాడ ననుపాయఁగా
చిగురుచింతలచేఁ జెక్కుచేరిచిన చేయి
పగటున నేఁడు చెట్టపట్టఁగఁబాలాయఁగా

(॥॥)
వడి నీవు పిలువఁగ వంచినట్టియీ శిరసు
అడరుమోవితేనియ లంది ఇచ్చెఁగా
యెడలేక శ్రీ వేంకటేశ నన్నుఁగూడితివి
విడువనిసిగ్గులెల్లా విడిపించితివిగా

(||pallavi||)
nāgum̐ jesinadi yĕllā naḍuma nīde kādā
dāgŏni yinniyunu nem̐ḍu tārugāṇalāyam̐gā

(||||)
kaṁduva nīvirahagnim̐ gām̐ginaṭṭinā menu
yiṁdu nīgām̐giḍigi nĕkkĕm̐gā nem̐ḍu
aṁdi kaḍuvem̐ḍigām̐gā naligi sūsinasūbu
saṁdaḍi nīgūḍamulo salluvĕdalāyam̐gā

(||||)
tĕgi nīdo vādaḍasi tiṭṭugŏnnayīnore
nagi nīdo māḍalāḍa nanubāyam̐gā
sigurusiṁtalasem̐ jĕkkuserisina seyi
pagaḍuna nem̐ḍu sĕṭṭabaṭṭam̐gam̐bālāyam̐gā

(||||)
vaḍi nīvu piluvam̐ga vaṁchinaṭṭiyī śhirasu
aḍarumovideniya laṁdi ichchĕm̐gā
yĕḍalega śhrī veṁkaḍeśha nannum̐gūḍidivi
viḍuvanisiggulĕllā viḍibiṁchidivigā