Naagum jeppugoraadu nalinaakshulaala meeru

నాకుఁ జెప్పుకోరాదు నలినాక్షులాల మీరు
Language

(॥పల్లవి॥)
నాకుఁ జెప్పుకోరాదు నలినాక్షులాల మీరు
పైకొని నా వోజ విన్నపము సేయరే

(॥॥)
వేడుకకు జవరాలు వెంగెమాడితే నమరు
ఆడరాదు కోపగించి అట్టే మగని
వాడికకు నతనితో వంతులకు రాఁదగు
కూడే వేళ సరివెట్టు కొని మీరఁ దగదు

(॥॥)
కడు సింగారమునకుఁ గన్నుల జంకించఁ దగు
జడియుచు గర్వమున సాదించరాదు
కడ లేక సేవ సేయఁగాచుక వుండుట మేలు
బడినెందూఁ బోకుండఁ బట్ట రాదు గాని

(॥॥)
చనవుతోఁ గూడిమాడి సరసమాడుట యొప్పు
పెనఁగుచు రతి వేళ బిగియ వద్దు
యెనసి శ్రీ వేంకటేశుఁ డింతలోనే నన్ను నేఁడు
మనసులో నెన్నటికి మఱవఁగ రాదు

(||pallavi||)
nāgum̐ jĕppugorādu nalinākṣhulāla mīru
paigŏni nā voja vinnabamu seyare

(||||)
veḍugagu javarālu vĕṁgĕmāḍide namaru
āḍarādu kobagiṁchi aṭṭe magani
vāḍigagu nadanido vaṁtulagu rām̐dagu
kūḍe veḽa sarivĕṭṭu kŏni mīram̐ dagadu

(||||)
kaḍu siṁgāramunagum̐ gannula jaṁkiṁcham̐ dagu
jaḍiyusu garvamuna sādiṁcharādu
kaḍa lega seva seyam̐gāsuga vuṁḍuḍa melu
baḍinĕṁdūm̐ boguṁḍam̐ baṭṭa rādu gāni

(||||)
sanavudom̐ gūḍimāḍi sarasamāḍuḍa yŏppu
pĕnam̐gusu radi veḽa bigiya vaddu
yĕnasi śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalone nannu nem̐ḍu
manasulo nĕnnaḍigi maṟavam̐ga rādu