Naagum delusumgaa nee naadagaalellaa

నాకుఁ దెలుసుఁగా నీ నాటకాలెల్లా
Language

(॥పల్లవి॥)
నాకుఁ దెలుసుఁగా నీ నాటకాలెల్లా
యీకడ నేమి సేసేవు యింటికి రావయ్యా

(॥నాకు॥)
తలపోఁత లొకతెపైఁ దగిలి నీకుండఁగాను
పిలిచితేఁ బలికేవా ప్రియముతోను
యెలమి నీమాయలు యెరఁగని సతులెల్లా
అలిగి వున్నాఁడవంటా నటు వేఁడుకొందురు

(॥నాకు॥)
యెడయ కెవ్వతో యింటికేఁగఁ గాచుకుండఁగాను
వొడి వట్టితే వచ్చేవా వూరకే నీవు
అడరి నీవోజ దెలియనివనితలెల్లాను
కడుఁ బంతగాఁడవంటా కాళ్ళకు మొక్కుదురు

(॥నాకు॥)
అక్కున నలమేల్‌మంగ ఆలై నీకునుండఁగాను
దక్కేవా శ్రీవెంకటేశ తరుణులకు
యిక్కడ నన్నేలతివి యేడనైనా వింత వారు
చొక్కి తగవరివంటా సుద్దులు చెప్పుదురు

(||pallavi||)
nāgum̐ dĕlusum̐gā nī nāḍagālĕllā
yīgaḍa nemi sesevu yiṁṭigi rāvayyā

(||nāgu||)
talabom̐ta lŏgadĕbaim̐ dagili nīguṁḍam̐gānu
pilisidem̐ baligevā priyamudonu
yĕlami nīmāyalu yĕram̐gani sadulĕllā
aligi vunnām̐ḍavaṁṭā naḍu vem̐ḍugŏṁduru

(||nāgu||)
yĕḍaya kĕvvado yiṁṭigem̐gam̐ gāsuguṁḍam̐gānu
vŏḍi vaṭṭide vachchevā vūrage nīvu
aḍari nīvoja dĕliyanivanidalĕllānu
kaḍum̐ baṁtagām̐ḍavaṁṭā kāḽḽagu mŏkkuduru

(||nāgu||)
akkuna nalamel‌maṁga ālai nīgunuṁḍam̐gānu
dakkevā śhrīvĕṁkaḍeśha taruṇulagu
yikkaḍa nanneladivi yeḍanainā viṁta vāru
sŏkki tagavarivaṁṭā suddulu sĕppuduru