Naagum delusu nidani naadagamulu

నాకుఁ దెలుసు నితని నాటకములు
Language

(॥పల్లవి॥)
నాకుఁ దెలుసు నితని నాటకములు
కైకొనీనా ఇంతలోనే కతకారిగాక

(॥॥)
యెఱఁగక చేఁత చేసి యెదిటికి రాఁడనేవు
వెఱువు వాని కేడదే వేసాలుగాక
వొఱువు నీమాటలకే వొడఁబడి తనమతి
కఱకరిఁ గరఁగీనా గామిడిగాక

(॥॥)
అగడుగాఁ దిరిగాడి యందుకు లోఁగీ ననేవు
తగ వాతఁ డెఱుఁగునా తక్కులుగాక
తగిలి తనబాసలు తలఁపించితే నేఁడు
మొగమోడినా కడుమొక్కలీఁడుగాక

(॥॥)
వలపు లంతటాఁ జూపి వచ్చి నన్నేలీ ననేవు
సులభుఁడా ఇవిగొన్ని సుద్దులుగాక
బలిమి లోనికి వచ్చి పై కొని శ్రీవేంకటేశుఁ-
డలమె నన్నుఁ గాఁగిట నాగడీఁడు గాక

(||pallavi||)
nāgum̐ dĕlusu nidani nāḍagamulu
kaigŏnīnā iṁtalone kadagārigāga

(||||)
yĕṟam̐gaga sem̐ta sesi yĕdiḍigi rām̐ḍanevu
vĕṟuvu vāni keḍade vesālugāga
vŏṟuvu nīmāḍalage vŏḍam̐baḍi tanamadi
kaṟagarim̐ garam̐gīnā gāmiḍigāga

(||||)
agaḍugām̐ dirigāḍi yaṁdugu lom̐gī nanevu
taga vādam̐ ḍĕṟum̐gunā takkulugāga
tagili tanabāsalu talam̐piṁchide nem̐ḍu
mŏgamoḍinā kaḍumŏkkalīm̐ḍugāga

(||||)
valabu laṁtaḍām̐ jūbi vachchi nannelī nanevu
sulabhum̐ḍā ivigŏnni suddulugāga
balimi lonigi vachchi pai kŏni śhrīveṁkaḍeśhum̐-
ḍalamĕ nannum̐ gām̐giḍa nāgaḍīm̐ḍu gāga