Naagum deliyadu nee naadagamulu

నాకుఁ దెలియదు నీ నాటకములు
Language

(॥పల్లవి॥)
నాకుఁ దెలియదు నీ నాటకములు
దాకొంటి విప్పు డెందలివాఁడవో

(॥నాకు॥)
నగవు నాతోఁగొంత నవ్వుతానే ఆవలఁ
బగటు మరియుఁగొంత పచరింతువు
మొగిచి నీమనసు యిరుమొనసూదియైయిపుడు
తగిలీని నీవు యెందలివాఁడవో

(॥నాకు॥)
పలుకులొకకొన్ని నాపైఁ జల్లుతా నవల
వలపులొకకొన్ని నివ్వటిలింతువు
తొలఁగకిటు రెండుచేతుల వెలంకాయలై
తళుకొత్తెఁ జేఁతలెందలివాఁడవో

(॥నాకు॥)
యిప్పుడిన్నిట నన్నునెనసి యెమ్మెలు నవల
చెప్పికొన్నిట నన్నుఁ జింతింతువు
చిప్పి లుచునిందుకే శ్రీ వెంకటేశ్వరుఁడ
దప్పిదేరెదవు యెందలివాఁడవో

(||pallavi||)
nāgum̐ dĕliyadu nī nāḍagamulu
dāgŏṁṭi vippu ḍĕṁdalivām̐ḍavo

(||nāgu||)
nagavu nādom̐gŏṁta navvudāne āvalam̐
bagaḍu mariyum̐gŏṁta pasariṁtuvu
mŏgisi nīmanasu yirumŏnasūdiyaiyibuḍu
tagilīni nīvu yĕṁdalivām̐ḍavo

(||nāgu||)
palugulŏgagŏnni nābaim̐ jalludā navala
valabulŏgagŏnni nivvaḍiliṁtuvu
tŏlam̐gagiḍu rĕṁḍusedula vĕlaṁkāyalai
taḽugŏttĕm̐ jem̐talĕṁdalivām̐ḍavo

(||nāgu||)
yippuḍinniḍa nannunĕnasi yĕmmĕlu navala
sĕppigŏnniḍa nannum̐ jiṁtiṁtuvu
sippi lusuniṁduge śhrī vĕṁkaḍeśhvarum̐ḍa
dappiderĕdavu yĕṁdalivām̐ḍavo