(॥పల్లవి॥)
నాకు వెఱవఁగనేల నాలితనాన
యీ కడ మోనాననుండే వెందాఁక నీవు
(॥నాకు॥)
వెలఁదియాడేమాఁట వింటివా వోయి
మలసి తానట నీకు మఱఁదలట
కలువదండ ఇచ్చుట కద్దా వోయి
కలది గలట్టె తారుకాణించుకోరాదా
(॥నాకు॥)
కామినిసేసేసన్నలు గంటివా వోయి
రామను నీ విక్కడికి రమ్మంటివట
ఆమించునీవుంగరము ఆపెదా వోయి
దీమసాన నాపె నీవుఁ దెలుసుకోరాదా
(॥నాకు॥)
యింతి నిన్నుఁ గూడెఁ జనవిచ్చితా వోయి
జంత శ్రీవేంకటేశ తా సవతియట
యింతట నలమేల్మంగ నన్నేలితివి
వింతగా నాపె నీవు విచారించుకోరాదా
(||pallavi||)
nāgu vĕṟavam̐ganela nālidanāna
yī kaḍa monānanuṁḍe vĕṁdām̐ka nīvu
(||nāgu||)
vĕlam̐diyāḍemām̐ṭa viṁṭivā voyi
malasi tānaḍa nīgu maṟam̐dalaḍa
kaluvadaṁḍa ichchuḍa kaddā voyi
kaladi galaṭṭĕ tārugāṇiṁchugorādā
(||nāgu||)
kāminisesesannalu gaṁṭivā voyi
rāmanu nī vikkaḍigi rammaṁṭivaḍa
āmiṁchunīvuṁgaramu ābĕdā voyi
dīmasāna nābĕ nīvum̐ dĕlusugorādā
(||nāgu||)
yiṁti ninnum̐ gūḍĕm̐ janavichchidā voyi
jaṁta śhrīveṁkaḍeśha tā savadiyaḍa
yiṁtaḍa nalamelmaṁga nannelidivi
viṁtagā nābĕ nīvu visāriṁchugorādā