Naagu niviye navvuloo | veeru

నాకు నివియే నవ్వులూ । వీరు
Language

(॥పల్లవి॥)
నాకు నివియే నవ్వులూ । వీరు
దాకొని కదిసిన దవ్వులూ

(॥నాకు ॥)
మానవయ్య నీమాటలూ యేల
తేనెలో నివే తేటలూ
నేనెఱిఁగినవె నీచేఁతలూ భువి
మోనములలోని మోఁతలూ

(॥నాకు॥)
చాలుఁజాలు నీసన్నలూః కడు
పోలఁజూచినపొన్నలూ
సోలి మును నేజూచినవే నేఁ-
డీలాగై కడునేఁచీ నివె

(॥నాకు॥)
చెల్లవిక నేల సిగ్గులూ నేడు
మొల్లపులకలే ముగ్గులూ
వెల్లవిరి శ్రీవేంకటేశ మన-
చల్లుఁగూటమే సంకెసేసె

(||pallavi||)
nāgu niviye navvulū | vīru
dāgŏni kadisina davvulū

(||nāgu ||)
mānavayya nīmāḍalū yela
tenĕlo nive teḍalū
nenĕṟim̐ginavĕ nīsem̐talū bhuvi
monamulaloni mom̐talū

(||nāgu||)
sālum̐jālu nīsannalūḥ kaḍu
polam̐jūsinabŏnnalū
soli munu nejūsinave nem̐-
ḍīlāgai kaḍunem̐sī nivĕ

(||nāgu||)
sĕllaviga nela siggulū neḍu
mŏllabulagale muggulū
vĕllaviri śhrīveṁkaḍeśha mana-
sallum̐gūḍame saṁkĕsesĕ