Naagu ninnum joosisoosi navvu vachcheeni

నాకు నిన్నుఁ జూచిచూచి నవ్వు వచ్చీని
Language

(॥పల్లవి॥)
నాకు నిన్నుఁ జూచిచూచి నవ్వు వచ్చీని
యేకతాన నన్నేలితి వేమిచప్పేదయ్యా

(॥నాకు॥)
తొయ్యలియొక్కెతకుఁ గందువ చెప్పుకుండఁగాను
వొయ్యనే వేరొకతె నీవొద్దికి వచ్చె
చెయ్యార విత్తొకటిడఁ జెట్టొకటై మొలచె-
నియ్యెడ నీవలపిదె యేమని చెప్పేదయ్యా

(॥నాకు॥)
పేరుకొని యొకతెను ప్రియముతోఁ బిలువఁగా
మారుపేరు దొకతె నెమ్మది నూఁకొనె
కోరినదొకటుండఁగా గొసరు వేరొకటాయ
యీరీతి నీభాగ్యము లేమిచెప్పేదయ్యా

(॥నాకు॥)
గక్కన వేరొకతేను కలయ సన్న సేసితే
నక్కున శ్రీదేవి నిన్ను నదె కూడెను
మొక్కొకటి మొక్కఁ గాను ముంచి దీవెనొకటాయ
యిక్కడ శ్రీవేకంటేశ యేమిచెప్పేదయ్యా

(||pallavi||)
nāgu ninnum̐ jūsisūsi navvu vachchīni
yegadāna nannelidi vemisappedayyā

(||nāgu||)
tŏyyaliyŏkkĕdagum̐ gaṁduva sĕppuguṁḍam̐gānu
vŏyyane verŏgadĕ nīvŏddigi vachchĕ
sĕyyāra vittŏgaḍiḍam̐ jĕṭṭŏgaḍai mŏlasĕ-
niyyĕḍa nīvalabidĕ yemani sĕppedayyā

(||nāgu||)
perugŏni yŏgadĕnu priyamudom̐ biluvam̐gā
māruberu dŏgadĕ nĕmmadi nūm̐kŏnĕ
korinadŏgaḍuṁḍam̐gā gŏsaru verŏgaḍāya
yīrīdi nībhāgyamu lemisĕppedayyā

(||nāgu||)
gakkana verŏgadenu kalaya sanna seside
nakkuna śhrīdevi ninnu nadĕ kūḍĕnu
mŏkkŏgaḍi mŏkkam̐ gānu muṁchi dīvĕnŏgaḍāya
yikkaḍa śhrīvegaṁṭeśha yemisĕppedayyā