Naagu neeve guri neegu nenu saakshi

నాకు నీవే గురి నీకు నేను సాక్షి
Language

(॥పల్లవి॥)
నాకు నీవే గురి నీకు నేను సాక్షి
దాకొని నన్ను నిట్టె దయఁజూడఁ గదరా

(॥నాకు॥)
యేరా నీమాఁట లెందాఁకా నాడేవు
గారవించి నాకుఁ గాఁగిలీరా
చేరి చూడఁగానే చెక్కులెల్లాఁ జెమరించె
తారుకాణాయ వలపు దయఁజూడఁగదరా

(॥నాకు॥)
జఱపులఁ బెట్టఁగానే సరివొద్దులాయను
మఱి పచ్చడము గప్పి మన్నించరా
చిఱునవ్వు నీది చూచి చిమ్మిరేఁగెఁ బులకలు
తఱి నీకే తెలుసును దయఁజూడఁగదరా

(॥నాకు॥)
గక్కన నీవు గూడఁగా గనమాయ కోరికలు
మొక్కేఁగాని నాకు మోవియ్యారా
నిక్కి శ్రీవేంకటేశుఁడ నినుఁజూచి దప్పిదేరె
దక్కితివి నిన్ను నిట్టె దయఁజూడఁగదరా

(||pallavi||)
nāgu nīve guri nīgu nenu sākṣhi
dāgŏni nannu niṭṭĕ dayam̐jūḍam̐ gadarā

(||nāgu||)
yerā nīmām̐ṭa lĕṁdām̐kā nāḍevu
gāraviṁchi nāgum̐ gām̐gilīrā
seri sūḍam̐gāne sĕkkulĕllām̐ jĕmariṁchĕ
tārugāṇāya valabu dayam̐jūḍam̐gadarā

(||nāgu||)
jaṟabulam̐ bĕṭṭam̐gāne sarivŏddulāyanu
maṟi pachchaḍamu gappi manniṁcharā
siṟunavvu nīdi sūsi simmirem̐gĕm̐ bulagalu
taṟi nīge tĕlusunu dayam̐jūḍam̐gadarā

(||nāgu||)
gakkana nīvu gūḍam̐gā ganamāya korigalu
mŏkkem̐gāni nāgu moviyyārā
nikki śhrīveṁkaḍeśhum̐ḍa ninum̐jūsi dappiderĕ
dakkidivi ninnu niṭṭĕ dayam̐jūḍam̐gadarā