Naagu neegu nokka reede nadanale veru gaani

నాకు నీకు నొక్క రీతే నటనలే వేరు గాని
Language

(॥పల్లవి॥)
నాకు నీకు నొక్క రీతే నటనలే వేరు గాని
మేకొన్న నా మనసయితే మిక్కిలి మెత్తనరా

(॥నాకు॥)
అంగనల రతుల నీ యసురుసురులు చూచి
వుంగిట నేనూ నసురుసు రైతిరా
చెంగటి నీ చెక్కుల చెమటలు నేఁ జూచి
అంగ మెల్లాఁ జెమరించి యందుకే కరఁగితి

(॥నాకు॥)
కందువచేఁతల నీ కన్నుల యెఱ్ఱన చచి
యిందునే నా కన్నులును యెఱ్ఱ నాయరా
వందులేని నీమేని వసివాడు లటు చూచి
అందపు నా దేహము తా నప్పటిని వాడెరా

(॥నాకు॥)
పంతపు నీ యాగడపు పరవశములు చూచి
వంతుకు నేఁ గోపపరవశమైతి రా
యింతట శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడఁగాను
సంతసాన నేనూఁ గూడిన సరికి సరి యైతిరా

(||pallavi||)
nāgu nīgu nŏkka rīde naḍanale veru gāni
megŏnna nā manasayide mikkili mĕttanarā

(||nāgu||)
aṁganala radula nī yasurusurulu sūsi
vuṁgiḍa nenū nasurusu raidirā
sĕṁgaḍi nī sĕkkula sĕmaḍalu nem̐ jūsi
aṁga mĕllām̐ jĕmariṁchi yaṁduge karam̐gidi

(||nāgu||)
kaṁduvasem̐tala nī kannula yĕṭrana sasi
yiṁdune nā kannulunu yĕṭra nāyarā
vaṁduleni nīmeni vasivāḍu laḍu sūsi
aṁdabu nā dehamu tā nappaḍini vāḍĕrā

(||nāgu||)
paṁtabu nī yāgaḍabu paravaśhamulu sūsi
vaṁtugu nem̐ gobabaravaśhamaidi rā
yiṁtaḍa śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍam̐gānu
saṁtasāna nenūm̐ gūḍina sarigi sari yaidirā