Naagu nee mogamu soosi navvu vachcheeni

నాకు నీ మొగము చూచి నవ్వు వచ్చీని
Language

(॥పల్లవి॥)
నాకు నీ మొగము చూచి నవ్వు వచ్చీని
కాకు సేయ కిఁక నైన గతి గూడవయ్యా

(॥నాకు॥)
పలుకు లెన్ని గలవు పాటించి బొంకఁగఁ బోతే
అలరీనా నీవంటి అందగానికి
చలము సాధించితివి చక్క నాయఁ బను లెల్ల
వెలయ మాయింటి కిఁక విచ్చేయవయ్యా

(॥నాకు॥)
ఆన లెన్నైనఁ గలవు అటమటించే నంటే
యీనెపాన నీవంటి యెమ్మెకానికి
నీనేర్పు లీడెరె నిన్ను నిందరు మెచ్చిరి
వీనులు చల్ల నాయను వీడె మిందవయ్యా

(॥నాకు॥)
వొడఁబా టైనఁ గద్దు వోపిక గలిగితేను
విడువక నీవంటి వేసదారికి
తొడిఁబడఁ గూడితివి దొమ్మితో శ్రీవెంకటెశ
బడలితివి రతులఁ బవ్వళించవయ్యా

(||pallavi||)
nāgu nī mŏgamu sūsi navvu vachchīni
kāgu seya kim̐ka naina gadi gūḍavayyā

(||nāgu||)
palugu lĕnni galavu pāḍiṁchi bŏṁkam̐gam̐ bode
alarīnā nīvaṁṭi aṁdagānigi
salamu sādhiṁchidivi sakka nāyam̐ banu lĕlla
vĕlaya māyiṁṭi kim̐ka vichcheyavayyā

(||nāgu||)
āna lĕnnainam̐ galavu aḍamaḍiṁche naṁṭe
yīnĕbāna nīvaṁṭi yĕmmĕgānigi
nīnerbu līḍĕrĕ ninnu niṁdaru mĕchchiri
vīnulu salla nāyanu vīḍĕ miṁdavayyā

(||nāgu||)
vŏḍam̐bā ṭainam̐ gaddu vobiga galigidenu
viḍuvaga nīvaṁṭi vesadārigi
tŏḍim̐baḍam̐ gūḍidivi dŏmmido śhrīvĕṁkaḍĕśha
baḍalidivi radulam̐ bavvaḽiṁchavayyā