Naagu namdu kemivodu nannu nee vemisoosevu

నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు
Language

(॥పల్లవి॥)
నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు
నీ కరుణ గలిగితే నించి చూపవయ్యా

(॥నాకు॥)
ఘోరమైన దేహపు దుర్గుణ మేమిగలిగిన
ఆరసిఁ బ్రకృతిఁబోయి అడుగవయ్యా
నేరని నాజన్మముతో నేరుపేమి గల్లా నన్ను
ధారుణిఁ బుట్టించిన విధాత నడుగవయ్యా

(॥నాకు॥)
పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా
అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా
ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా

(॥నాకు॥)
అన్నిటా నావెనకటి‌ అపరాధమేమి గల్లా
మన్నించి నాగురుఁ జూచి మానవయ్యా
మిన్నక శ్రీవేంకటేశ మీఁదిపనులేమి గల్లా
నిన్నుఁ జూచుకొని నన్ను నీవే యేలవయ్యా

(||pallavi||)
nāgu naṁdu kemivodu nannu nī vemisūsevu
nī karuṇa galigide niṁchi sūbavayyā

(||nāgu||)
ghoramaina dehabu durguṇa memigaligina
ārasim̐ brakṛtim̐boyi aḍugavayyā
nerani nājanmamudo nerubemi gallā nannu
dhāruṇim̐ buṭṭiṁchina vidhāda naḍugavayyā

(||nāgu||)
paṁcheṁdriyamulaloni pāba memi galiginā
aṁchĕlam̐ gāmunim̐boyi aḍugavayyā
muṁchina nāgarmamulo mosamemi galiginā
maṁchidanānam̐ jeyiṁche māya naḍugavayyā

(||nāgu||)
anniḍā nāvĕnagaḍi‌ abarādhamemi gallā
manniṁchi nāgurum̐ jūsi mānavayyā
minnaga śhrīveṁkaḍeśha mīm̐dibanulemi gallā
ninnum̐ jūsugŏni nannu nīve yelavayyā