Naagu naage pogadugonanum baadi gaadu gaaga

నాకు నాకే పొగడుకొననుఁ బాడి గాదు గాక
Language

(॥పల్లవి॥)
నాకు నాకే పొగడుకొననుఁ బాడి గాదు గాక
మేకులకిందరిలోన మెప్పించుకో నేరనా

(॥నాకు॥)
తీపుల నీమాటలకు తేలితేఁ దేలుదుఁగాక
యేపున జాణతనాన నెక్కుడు గానా
పై పై నీకు మోహించి పరవశమౌదుఁ గాక
కోపగించి నిన్ను నొక్కకొలికికిఁ దెత్తు(దేనిత్తు?)నా

(॥నాకు॥)
వలచి నీయ్యెడకే నే వాసి వంతులెంచఁగాక
చలివాయ నిన్నుఁ గడు సాదించలేనా
కలసి వుండి నీకొక్కనికే వెరతుఁ గాక
తెలిసి నీ దిక్కొకతెఁ దేరిచూడనిత్తునా

(॥నాకు॥)
మనసు నీపైఁ బెట్టి మారాడజాలఁ గాక
పనివడి నిన్ను నిట్టె బ్రమయించనా
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిటఁ బాయవు గాక
వెనకటివలె నైతే వెల్లవిరి సేయనా

(||pallavi||)
nāgu nāge pŏgaḍugŏnanum̐ bāḍi gādu gāga
megulagiṁdarilona mĕppiṁchugo neranā

(||nāgu||)
tībula nīmāḍalagu telidem̐ deludum̐gāga
yebuna jāṇadanāna nĕkkuḍu gānā
pai pai nīgu mohiṁchi paravaśhamaudum̐ gāga
kobagiṁchi ninnu nŏkkagŏligikim̐ dĕttu(denittu?)nā

(||nāgu||)
valasi nīyyĕḍage ne vāsi vaṁtulĕṁcham̐gāga
salivāya ninnum̐ gaḍu sādiṁchalenā
kalasi vuṁḍi nīgŏkkanige vĕradum̐ gāga
tĕlisi nī dikkŏgadĕm̐ derisūḍanittunā

(||nāgu||)
manasu nībaim̐ bĕṭṭi mārāḍajālam̐ gāga
panivaḍi ninnu niṭṭĕ bramayiṁchanā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍam̐ bāyavu gāga
vĕnagaḍivalĕ naide vĕllaviri seyanā