Naagu mogamodi yaage nanu pela daamsevu

నాకు మొకమోడి యాకె నను పేల దాఁచేవు
Language

(॥పల్లవి॥)
నాకు మొకమోడి యాకె నను పేల దాఁచేవు
జోకతోడ మాటలాడి సోదించరాదా

(॥॥)
నిక్కి నిక్కి యదే చెలి నీవంక చూచీని
దిక్కుల నాపె తలఁపు దెలియరాదా
చెక్కుపైఁ బెట్టిన చేతఁ జిరునవ్వు మూసీని
అక్కఱతో నదేమని యడుగరాదా

(॥॥)
ఆడుకొనీఁ జెలి తోడ నాకె నీ సుద్దులో యేమో
వేడుకతో నీ వవి వినరాదా
తోడనే నిమ్మ పండ్లు చేతులఁ బట్టు కున్నది
యీడ నీకుఁ గాను కిచ్చీనెమో అందరాదా

(॥॥)
కూరిమి తోడుత నాపె కొంగు నిన్నుఁ దాఁకించీ
నేరుపుతోఁ గౌఁగిట నించరాదా
యీరీతి శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
గారవించి యాపె గుట్టు గనుకోరాదా

(||pallavi||)
nāgu mŏgamoḍi yāgĕ nanu pela dām̐sevu
jogadoḍa māḍalāḍi sodiṁcharādā

(||||)
nikki nikki yade sĕli nīvaṁka sūsīni
dikkula nābĕ talam̐pu dĕliyarādā
sĕkkubaim̐ bĕṭṭina sedam̐ jirunavvu mūsīni
akkaṟado nademani yaḍugarādā

(||||)
āḍugŏnīm̐ jĕli toḍa nāgĕ nī suddulo yemo
veḍugado nī vavi vinarādā
toḍane nimma paṁḍlu sedulam̐ baṭṭu kunnadi
yīḍa nīgum̐ gānu kichchīnĕmo aṁdarādā

(||||)
kūrimi toḍuda nābĕ kŏṁgu ninnum̐ dām̐kiṁchī
nerubudom̐ gaum̐giḍa niṁcharādā
yīrīdi śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
gāraviṁchi yābĕ guṭṭu ganugorādā