నాకు మీ నేరుపు చూచి నవ్వు వచ్చీని
(॥పల్లవి॥)
నాకు మీ నేరుపు చూచి నవ్వు వచ్చీని
చేకొని మీ కిద్దరికిఁ జెల్లుబ డౌనయ్యా
(॥॥)
పందెమాడి నీతోను పడఁతి చేయి వేసితే
అంది చిక్కించు కొనేవు అట్టే నీవూ
విందు వెట్టే నని చెలి వేఁడుకొన్నా మానవు
కందువకు రమ్మనేవు కడు జాణవయ్యా
(॥॥)
కానుకగా నిమ్మపండ్లు కాంత నీకుఁ జూపితేను
ఆనుక చన్ను లందుక అట్టే తీసేవు
పూని నీకు మొక్కినాను పోనియ్యక పెనఁగుతా
తేనెమోవి యిమ్మనేవు దేవరవయ్యా
(॥॥)
కదిసి వీడె మిచ్చితే కడుఁ దమకముతోడ
అదనఁ గౌఁగిట నించే వంతలోననే
యిదివో శ్రీ వేంకటేశ యెనసినాఁ దనియవు
పదిమారులుఁ గూడేవు పంతగాఁడవయ్యా
(||pallavi||)
nāgu mī nerubu sūsi navvu vachchīni
segŏni mī kiddarigim̐ jĕlluba ḍaunayyā
(||||)
paṁdĕmāḍi nīdonu paḍam̐ti seyi veside
aṁdi sikkiṁchu kŏnevu aṭṭe nīvū
viṁdu vĕṭṭe nani sĕli vem̐ḍugŏnnā mānavu
kaṁduvagu rammanevu kaḍu jāṇavayyā
(||||)
kānugagā nimmabaṁḍlu kāṁta nīgum̐ jūbidenu
ānuga sannu laṁduga aṭṭe tīsevu
pūni nīgu mŏkkinānu poniyyaga pĕnam̐gudā
tenĕmovi yimmanevu devaravayyā
(||||)
kadisi vīḍĕ michchide kaḍum̐ damagamudoḍa
adanam̐ gaum̐giḍa niṁche vaṁtalonane
yidivo śhrī veṁkaḍeśha yĕnasinām̐ daniyavu
padimārulum̐ gūḍevu paṁtagām̐ḍavayyā