నాకొరకు నిన్ను నింత నలఁగించవలెనా
(॥పల్లవి॥)
నాకొరకు నిన్ను నింత నలఁగించవలెనా
నీకు నితవైనంతే నే నొడఁబడితిరా
(॥॥)
వొలసీనొల్లనిచోట నొరసితే విసుపౌను
బలిమి సేయఁగఁ బోతే పసురౌను
తలఁచితే నీవు నాతలఁపులో నుండుదువు
చెలి నీ కూటమి నింతవేసరించనోపరా
(॥॥)
సారె సారె బెనఁగితేఁ జప్పనౌను వుప్పనౌను
కూరిమిఁ గొనరఁబోతే కోపమౌను
చేరువ నీ రూపము నా చిత్తరువులో నున్నది
కోరి నీ వెంటఁదగిలి కోసి రాచనోపరా
(॥॥)
తనిసినరతివేళ తగుమోవే మొగచాటు
అనఁగి పెనఁగఁబోతే నలపౌను
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసిత విటు నన్ను
మనసు లొక్కటాయ మారుమాట లోపరా
(||pallavi||)
nāgŏragu ninnu niṁta nalam̐giṁchavalĕnā
nīgu nidavainaṁte ne nŏḍam̐baḍidirā
(||||)
vŏlasīnŏllanisoḍa nŏraside visubaunu
balimi seyam̐gam̐ bode pasuraunu
talam̐side nīvu nādalam̐pulo nuṁḍuduvu
sĕli nī kūḍami niṁtavesariṁchanobarā
(||||)
sārĕ sārĕ bĕnam̐gidem̐ jappanaunu vuppanaunu
kūrimim̐ gŏnaram̐bode kobamaunu
seruva nī rūbamu nā sittaruvulo nunnadi
kori nī vĕṁṭam̐dagili kosi rāsanobarā
(||||)
tanisinaradiveḽa tagumove mŏgasāḍu
anam̐gi pĕnam̐gam̐bode nalabaunu
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kalasida viḍu nannu
manasu lŏkkaḍāya mārumāḍa lobarā