నాకొఱకే గడించెనో నగి యీలోకము హరి
(॥పల్లవి॥)
నాకొఱకే గడించెనో నగి యీలోకము హరి
లాకలై యెటు చూచినా లంపటా లిట్లున్నవి
(॥నాకొ॥)
తీరనిమాయ నా వొక దేహసంబంధానకే కా
వూరఁ గూటపు సంసార మొగిఁ జేసేము
ధారుణిలో నాయొక్కతగు బ్రదుకున కే కా
యీరీతి సీమలో యిండ్లు యెక్కడ చూచినను
(॥నాకొ॥)
బంతినే నాకు నానాఁటి పట్టెఁడు గూటికే కా
వంతఁ గృషిగోరక్షవాణిజ్యాదులు
వంతుల నూరేండ్లుండే వట్టియాసలకునే కా
పంతపు బ్రహ్మాండము పిఱుఁదుకొనేది
(॥నాకొ॥)
కొంచెపు దేవరకును కొండంత పత్తిరివలె
ముంచుకొని వున్న దిదె మోచి గర్వము
అంచల శ్రీవేంకటేశుఁ డన్నిటి కొక్కటే కీలు
యెంచి నీ శరణనఁగా నితఁడే మన్నించెను
(||pallavi||)
nāgŏṟage gaḍiṁchĕno nagi yīlogamu hari
lāgalai yĕḍu sūsinā laṁpaḍā liṭlunnavi
(||nāgŏ||)
tīranimāya nā vŏga dehasaṁbaṁdhānage kā
vūram̐ gūḍabu saṁsāra mŏgim̐ jesemu
dhāruṇilo nāyŏkkadagu braduguna ke kā
yīrīdi sīmalo yiṁḍlu yĕkkaḍa sūsinanu
(||nāgŏ||)
baṁtine nāgu nānām̐ṭi paṭṭĕm̐ḍu gūḍige kā
vaṁtam̐ gṛṣhigorakṣhavāṇijyādulu
vaṁtula nūreṁḍluṁḍe vaṭṭiyāsalagune kā
paṁtabu brahmāṁḍamu piṟum̐dugŏnedi
(||nāgŏ||)
kŏṁchĕbu devaragunu kŏṁḍaṁta pattirivalĕ
muṁchugŏni vunna didĕ mosi garvamu
aṁchala śhrīveṁkaḍeśhum̐ ḍanniḍi kŏkkaḍe kīlu
yĕṁchi nī śharaṇanam̐gā nidam̐ḍe manniṁchĕnu