Naagora kamtinaa nee naadagaana kamtim gaaga

నాకొర కంటినా నీ నాటకాన కంటిఁ గాక
Language

(॥పల్లవి॥)
నాకొర కంటినా నీ నాటకాన కంటిఁ గాక
యీకడ నాకు మొక్కే వేఁటి కింతే సానలు

(॥నాకొర॥)
చిత్తజకేలికి నీవు చేర వైతి వంటినా
హత్తి నీ వెందో వుంటి వంటిఁ గాకా
పొత్తుకు రావలసి నేఁ బోరి యింతే సంటినా
అత్తలివారిపొత్తు లరసితిఁ గాకా

(॥నాకొర॥)
వుంగరము నాకు నీవు వుంకువ యిమ్మంటినా
అంగడి నెవ్వతె యిచ్చె నంటిఁ గాకా
కంగి నాతో నీ విట్టె వల్ల లాడే వంటినా
అంగనతో నే మని యంటి వంటిఁ గాకా

(॥నాకొర॥)
నావద్దనె వుండు మని నమ్మక నే నంటినా
ఆవలివారు నిం దాడే రంటిఁ గాకా
శ్రీవెంకటేశుఁడ నన్ను చేకొని కూడితి విట్టె
భావరితి నాపెనుఁ జెప్పకు మంటిఁ గాకా

(||pallavi||)
nāgŏra kaṁṭinā nī nāḍagāna kaṁṭim̐ gāga
yīgaḍa nāgu mŏkke vem̐ṭi kiṁte sānalu

(||nāgŏra||)
sittajageligi nīvu sera vaidi vaṁṭinā
hatti nī vĕṁdo vuṁṭi vaṁṭim̐ gāgā
pŏttugu rāvalasi nem̐ bori yiṁte saṁṭinā
attalivāribŏttu larasidim̐ gāgā

(||nāgŏra||)
vuṁgaramu nāgu nīvu vuṁkuva yimmaṁṭinā
aṁgaḍi nĕvvadĕ yichchĕ naṁṭim̐ gāgā
kaṁgi nādo nī viṭṭĕ valla lāḍe vaṁṭinā
aṁganado ne mani yaṁṭi vaṁṭim̐ gāgā

(||nāgŏra||)
nāvaddanĕ vuṁḍu mani nammaga ne naṁṭinā
āvalivāru niṁ dāḍe raṁṭim̐ gāgā
śhrīvĕṁkaḍeśhum̐ḍa nannu segŏni kūḍidi viṭṭĕ
bhāvaridi nābĕnum̐ jĕppagu maṁṭim̐ gāgā