Naagemta priyamu seppee naamtageemdu

నాకెంత ప్రియము చెప్పీ నాఁటకీఁడు
Language

(॥పల్లవి॥)
నాకెంత ప్రియము చెప్పీ నాఁటకీఁడు
కైకొని పొదిగీ నట్టే కాతరీఁడు

(॥॥)
వన్నెలఁ జెరఁగువట్టి వద్దఁగూచుండఁ బెట్టుక
యెన్నిమాటలాడీ నాతో నెమ్మెకాఁడు
కిన్నెర నాచేతికిచ్చి కిణకిణ వాయింపించి
అన్నిటా మెచ్చీఁగదె ఆసోదకాఁడు

(॥॥)
వూరకే నేనుండఁగాను వొళ్ళిమీఁదఁ జేయివేసి
సారెకెంత నవ్వీనే జాణకాఁడు
మేరమీఱీ జూజాలాడి మిక్కిలి తానే వోడి
కూరిమేమి గొసరీనే కోడెకాఁడు

(॥॥)
తనివిదీరక వచ్చి తనకు నే మొక్కఁగాను
పనులెన్ని చెప్పీనే పంతగాఁడు
చనవిచ్చి శ్రీవేంకటేశ్వరుఁడు తానె నన్నేలె
ననుపు తానెంత సేసీ నాలికాఁడు

(||pallavi||)
nāgĕṁta priyamu sĕppī nām̐ṭagīm̐ḍu
kaigŏni pŏdigī naṭṭe kādarīm̐ḍu

(||||)
vannĕlam̐ jĕram̐guvaṭṭi vaddam̐gūsuṁḍam̐ bĕṭṭuga
yĕnnimāḍalāḍī nādo nĕmmĕgām̐ḍu
kinnĕra nāsedigichchi kiṇagiṇa vāyiṁpiṁchi
anniḍā mĕchchīm̐gadĕ āsodagām̐ḍu

(||||)
vūrage nenuṁḍam̐gānu vŏḽḽimīm̐dam̐ jeyivesi
sārĕgĕṁta navvīne jāṇagām̐ḍu
meramīṟī jūjālāḍi mikkili tāne voḍi
kūrimemi gŏsarīne koḍĕgām̐ḍu

(||||)
tanividīraga vachchi tanagu ne mŏkkam̐gānu
panulĕnni sĕppīne paṁtagām̐ḍu
sanavichchi śhrīveṁkaḍeśhvarum̐ḍu tānĕ nannelĕ
nanubu tānĕṁta sesī nāligām̐ḍu