Naagela veṟasevu naduma neevu

నాకేల వెఱచేవు నడుమ నీవు
Language

(॥పల్లవి॥)
నాకేల వెఱచేవు నడుమ నీవు
జోకతో నీ యంకెకు రాఁ జూచుకోవయ్యా

(॥॥)
తేటలుగా ముక్కరముత్తె మించుక గదలఁగ
మాటలాడీ వినవయ్య మగువ నీతో
కాటుక కన్నులారిచి గక్కునఁ జూచీ నదే
నేఁటికి యాపె నేరవేర్చవయ్యా

(॥॥)
గల్లుమని తనచేతి కంకణాలు మొఱయఁగ
నల్ల దే కానుకయిచ్చీ నందుకోవయ్యా
మొల్లతురుముతోడ మొక్కులు మొక్కీ నదే
చల్లగా నందుకేమాయ సమ్మతించవయ్యా

(॥॥)
తళుకుగమ్మలు సందిదండలును మెరువఁగ
కలికి గాగిలించీ గలయవయ్యా
యెలమి శ్రీవేంకటేశ యిటునన్ను నేలితివి
బలిమి నిద్దరి నిట్టే పాయకుండవయ్యా

(||pallavi||)
nāgela vĕṟasevu naḍuma nīvu
jogado nī yaṁkĕgu rām̐ jūsugovayyā

(||||)
teḍalugā mukkaramuttĕ miṁchuga gadalam̐ga
māḍalāḍī vinavayya maguva nīdo
kāḍuga kannulārisi gakkunam̐ jūsī nade
nem̐ṭigi yābĕ neraversavayyā

(||||)
gallumani tanasedi kaṁkaṇālu mŏṟayam̐ga
nalla de kānugayichchī naṁdugovayyā
mŏlladurumudoḍa mŏkkulu mŏkkī nade
sallagā naṁdugemāya sammadiṁchavayyā

(||||)
taḽugugammalu saṁdidaṁḍalunu mĕruvam̐ga
kaligi gāgiliṁchī galayavayyā
yĕlami śhrīveṁkaḍeśha yiḍunannu nelidivi
balimi niddari niṭṭe pāyaguṁḍavayyā