Naagela lomgevu naduma neevu

నాకేల లోఁగేవు నడుమ నీవు
Language

(॥పల్లవి॥)
నాకేల లోఁగేవు నడుమ నీవు
పైకొని నే నిందుకుఁగా పచారించేనా

(॥నాకే॥)
కలికిఁ బొరుగాపెనుఁ గని నామోము చూచేవు
వలచి తెచ్చుకోఁగాను వద్దనేనా
మొలకచన్నులు గడుమొనలంటాఁ బొగడేవు
కులికి పట్టిచూఁడగా కోపగించేనా

(॥నాకే॥)
సారె నాపె నవ్వంగాను సన్నలఁ జూపవచ్చేవు
చేరి కాఁగిలించుకోఁగా చేయివట్టేనా
చేరఁ డేసి కన్నులంటా చిత్తగించి బ్రమసేవు
ఆరసి పెండ్లాడఁగా నౌఁగాదనేనా

(॥నాకే॥)
వెస నాపె మాటాడఁగా వినుమని నన్ననేవు
వసముచేసుకోంగాను వారించేనా
కొసరి శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
పసగాఁ జనవియ్యఁగా పంతమాడేనా

(||pallavi||)
nāgela lom̐gevu naḍuma nīvu
paigŏni ne niṁdugum̐gā pasāriṁchenā

(||nāge||)
kaligim̐ bŏrugābĕnum̐ gani nāmomu sūsevu
valasi tĕchchugom̐gānu vaddanenā
mŏlagasannulu gaḍumŏnalaṁṭām̐ bŏgaḍevu
kuligi paṭṭisūm̐ḍagā kobagiṁchenā

(||nāge||)
sārĕ nābĕ navvaṁgānu sannalam̐ jūbavachchevu
seri kām̐giliṁchugom̐gā seyivaṭṭenā
seram̐ ḍesi kannulaṁṭā sittagiṁchi bramasevu
ārasi pĕṁḍlāḍam̐gā naum̐gādanenā

(||nāge||)
vĕsa nābĕ māḍāḍam̐gā vinumani nannanevu
vasamusesugoṁgānu vāriṁchenā
kŏsari śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
pasagām̐ janaviyyam̐gā paṁtamāḍenā