Naage sadamaide maado navvavayyaa

నాకే సతమైతే మాతో నవ్వవయ్యా
Language

(॥పల్లవి॥)
నాకే సతమైతే మాతో నవ్వవయ్యా
కాకు సేసే చేఁతలైతే కాఁక కోపమయ్యా

(॥నాకే॥)
సంగడిఁ గూచుండిమంటా సరుస నిందలాడేరు
రంగుగా నింత మాకు రవ్వ యేల్లయ్యా
యెంగిలి సేసేవు మోవి యెక్కడనుండో వచ్చి
వుంగిటి తరితీపుల కోపమయ్యా

(॥నాకే॥)
సరసమాడితిమంటా సతులెల్లా నేఁకరేరు
తరఁగు మొరఁగులైతే తగులేలయ్యా
కరగించేవు మనసు కడలఁ దనిసివచ్చి
పొరగుపోరచులై తే పొందుకోపమయ్యా

(॥నాకే॥)
కూడితి నన్నునంటా కొమ్మలెల్లా గొణఁగేరు
ఆడికలకు లోనైతి మదిగోవయ్యా
వేడుక వుట్టించేవు శ్రీవేంకటేశ నేడు వచ్చి
తోడుత నలసితిమి దొమ్మి కోపమయ్యా

(||pallavi||)
nāge sadamaide mādo navvavayyā
kāgu sese sem̐talaide kām̐ka kobamayyā

(||nāge||)
saṁgaḍim̐ gūsuṁḍimaṁṭā sarusa niṁdalāḍeru
raṁgugā niṁta māgu ravva yellayyā
yĕṁgili sesevu movi yĕkkaḍanuṁḍo vachchi
vuṁgiḍi taridībula kobamayyā

(||nāge||)
sarasamāḍidimaṁṭā sadulĕllā nem̐kareru
taram̐gu mŏram̐gulaide tagulelayyā
karagiṁchevu manasu kaḍalam̐ danisivachchi
pŏraguborasulai te pŏṁdugobamayyā

(||nāge||)
kūḍidi nannunaṁṭā kŏmmalĕllā gŏṇam̐geru
āḍigalagu lonaidi madigovayyā
veḍuga vuṭṭiṁchevu śhrīveṁkaḍeśha neḍu vachchi
toḍuda nalasidimi dŏmmi kobamayyā