Naadulellaam bogaderu nalinalosana ninnu

నాతులెల్లాఁ బొగడేరు నలినలోచన నిన్ను
Language

(॥పల్లవి॥)
నాతులెల్లాఁ బొగడేరు నలినలోచన నిన్ను
నీతులెల్లాఁ బచరించ నీవే నేరుతువే

(॥నాతు॥)
యితవైన చోటికి యేమి సేసినా సమ్మతి
రతికెక్కిన మీఁదట రారాఁపు లేదు
సతమైన పనులకు సాదించఁ బనిలేదు
చతురత లివియెల్లా సతి నీవే నేర్తువే

(॥నాతు॥)
మొగమోట లోనరితే ముందు వెనక లెంచరు
నగితేనే మనసులు నమ్మిక వుట్టు
తగవు దప్పుకుండితే తాలిమి తానే కలుగు
నిగిడి యీ పనులకు నీవే నేరుతువే

(॥నాతు॥)
మచ్చికలు నెరపితే మర్మములు గరఁగును
ఇచ్చకము సేసితేను యెరవుగాదు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగ నిన్నేలె
నిచ్చలు యీ సొబగులు నీవే నేరుతువే

(||pallavi||)
nādulĕllām̐ bŏgaḍeru nalinalosana ninnu
nīdulĕllām̐ basariṁcha nīve neruduve

(||nādu||)
yidavaina soḍigi yemi sesinā sammadi
radigĕkkina mīm̐daḍa rārām̐pu ledu
sadamaina panulagu sādiṁcham̐ baniledu
sadurada liviyĕllā sadi nīve nerduve

(||nādu||)
mŏgamoḍa lonaride muṁdu vĕnaga lĕṁcharu
nagidene manasulu nammiga vuṭṭu
tagavu dappuguṁḍide tālimi tāne kalugu
nigiḍi yī panulagu nīve neruduve

(||nādu||)
machchigalu nĕrabide marmamulu garam̐gunu
ichchagamu sesidenu yĕravugādu
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁga ninnelĕ
nichchalu yī sŏbagulu nīve neruduve