Naadone aanadeevayya namtuna samtasimchenu

నాతోనె ఆనతీవయ్య నంటున సంతసించేను
Language

(॥పల్లవి॥)
నాతోనె ఆనతీవయ్య నంటున సంతసించేను
చేతికి లోనైతి విఁకఁ జేరె నాకు మేలు

(॥నీతోనె॥)
చెప్పి నే నంపినమాట చెవుల కిం పాయనా
తప్పులు లేవు గదా ఆతరవాతను
నెప్పున దాఁచఁగ నేల నిన్నుఁ బాయలే నంటి
యిప్పు డిట్టె విచ్చేసితి వియ్యకోలా నీకు

(॥నాతేనె॥)
జిగి నా కాకుక నీకు చిత్తము వచ్చెనా నేఁడు
వెగట్లు నీవు గదా వేరె అందు
నిగిడి కొంకఁగ నేల నీబాస దలఁచు మంటి
అగపడితివి నాకు అవునా నా పొందులు

(॥నాతోనె॥)
మొక్కిన నా మొక్కు నీకు మొగమోట కెక్కెనా
మొక్కలము లేదు గదా మోహములోన
యిక్కు వెరిఁగి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితిని
దక్కితిని యింత నాపై దయ గద్దా నీవూ

(||pallavi||)
nādonĕ ānadīvayya naṁṭuna saṁtasiṁchenu
sedigi lonaidi vim̐kam̐ jerĕ nāgu melu

(||nīdonĕ||)
sĕppi ne naṁpinamāḍa sĕvula kiṁ pāyanā
tappulu levu gadā ādaravādanu
nĕppuna dām̐sam̐ga nela ninnum̐ bāyale naṁṭi
yippu ḍiṭṭĕ vichchesidi viyyagolā nīgu

(||nādenĕ||)
jigi nā kāguga nīgu sittamu vachchĕnā nem̐ḍu
vĕgaṭlu nīvu gadā verĕ aṁdu
nigiḍi kŏṁkam̐ga nela nībāsa dalam̐su maṁṭi
agabaḍidivi nāgu avunā nā pŏṁdulu

(||nādonĕ||)
mŏkkina nā mŏkku nīgu mŏgamoḍa kĕkkĕnā
mŏkkalamu ledu gadā mohamulona
yikku vĕrim̐gi śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidini
dakkidini yiṁta nābai daya gaddā nīvū