నాతో పొందు లిఁకఁ జూడు నాలికాఁడా
(॥పల్లవి॥)
నాతో పొందు లిఁకఁ జూడు నాలికాఁడా
నీ తలఁపులెల్లాఁ గంటి నీటుకాఁడా
(॥నాతో॥)
వేడుకకాఁడవై నీవు వేగినంతా చెలులతో
వాడిక చూపితివిగా వన్నెకాఁడా
వీడెపు సెలవులతో వింత వింత మాఁటలాడి
యేడలేని నవ్వు నవ్వే వెమ్మెకాఁడా
(॥నాతో॥)
వుమ్మడి నందరిమీఁద నువ్విళ్ళూర వలపులు
కుమ్మరించితివిగా కోడెకాఁడా
చిమ్ముచుఁ జెనకులనే సిగ్గులు రేఁచిరేఁచి
పమ్ముఁ జూపులఁ జూచేటిపంతగాఁడా
(॥నాతో॥)
చేయిమీఁదుగా నావు చేరి యొకరొకరినే
ఆయము లంటితివిగా అందగాఁడా
యాయెడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కాయజకేలిఁ గూడితి కతలకాఁడా
(||pallavi||)
nādo pŏṁdu lim̐kam̐ jūḍu nāligām̐ḍā
nī talam̐pulĕllām̐ gaṁṭi nīḍugām̐ḍā
(||nādo||)
veḍugagām̐ḍavai nīvu veginaṁtā sĕlulado
vāḍiga sūbidivigā vannĕgām̐ḍā
vīḍĕbu sĕlavulado viṁta viṁta mām̐ṭalāḍi
yeḍaleni navvu navve vĕmmĕgām̐ḍā
(||nādo||)
vummaḍi naṁdarimīm̐da nuvviḽḽūra valabulu
kummariṁchidivigā koḍĕgām̐ḍā
simmusum̐ jĕnagulane siggulu rem̐sirem̐si
pammum̐ jūbulam̐ jūseḍibaṁtagām̐ḍā
(||nādo||)
seyimīm̐dugā nāvu seri yŏgarŏgarine
āyamu laṁṭidivigā aṁdagām̐ḍā
yāyĕḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kāyajagelim̐ gūḍidi kadalagām̐ḍā