Naado noorage neevu navvevu gaaga

నాతో నూరకే నీవు నవ్వేవు గాక
Language

(॥పల్లవి॥)
నాతో నూరకే నీవు నవ్వేవు గాక
రాతిరి నీమాఁట వూరకపోవనిచ్చేవా

(॥నాతో॥)
కొంకక నీవును నేనుఁ గూడి యున్న రతివేళ
బింకము లాడుచు నట్టె పెనఁగితివి
అంకెల నాకుచములు అంతవేఁగు లని నీవు
జంకెనతో ములిగేవు సత్తు వెల్లా నిట్టిదా

(॥నాతో॥)
మంచముపై నిద్దరము మంతన మున్నంతపడి
కంచువలె వాఁగెను నీ గబ్బికుత్తికె
కొంచపు నామాట లివి కొండలనెల లనుచు
యించుకలో భ్రమసేవు యిట్టిదా నీవోరుపు

(॥నాతో॥)
మోవి మోవిఁ గూడి తేనె ముసరి యానినఁదాకా
నీవు నే న నెరఁగవు నిండఁ జొక్కుచు
శ్రీవెంకటేశుఁడు గోరఁ జెనకితేఁ దెలిసేవు
యీవల నీతో కూటము లిటుంటివా

(||pallavi||)
nādo nūrage nīvu navvevu gāga
rādiri nīmām̐ṭa vūragabovanichchevā

(||nādo||)
kŏṁkaga nīvunu nenum̐ gūḍi yunna radiveḽa
biṁkamu lāḍusu naṭṭĕ pĕnam̐gidivi
aṁkĕla nāgusamulu aṁtavem̐gu lani nīvu
jaṁkĕnado muligevu sattu vĕllā niṭṭidā

(||nādo||)
maṁchamubai niddaramu maṁtana munnaṁtabaḍi
kaṁchuvalĕ vām̐gĕnu nī gabbiguttigĕ
kŏṁchabu nāmāḍa livi kŏṁḍalanĕla lanusu
yiṁchugalo bhramasevu yiṭṭidā nīvorubu

(||nādo||)
movi movim̐ gūḍi tenĕ musari yāninam̐dāgā
nīvu ne na nĕram̐gavu niṁḍam̐ jŏkkusu
śhrīvĕṁkaḍeśhum̐ḍu goram̐ jĕnagidem̐ dĕlisevu
yīvala nīdo kūḍamu liḍuṁṭivā