Naado nemtigi naadagamu

నాతొ నేఁటికి నాటకము
Language

(॥పల్లవి॥)
నాతొ నేఁటికి నాటకము
ఘాతలనే నినుఁ గాదనేనా

(॥నాతో॥)
లలనకు నీమోవి లంచమియ్యఁగా
పలికీ నిచ్చలు పలుమారు
పలు నీసుద్దులు పరుల నడుగుమా
తెలిపేరందరు తెల్లమిగాను

(॥నాతో॥)
మగువచన్నుఁగవ మరి నీవంటఁగ
మొగమోటములే ముంచీనిదే
అగు నీసేతలు అందరి నడుగుమా
తగవైనట్లనె తలఁపించేరు

(॥నాతో॥)
యింతిఁ గాఁగిటను యిటు నీవెనయఁగ
అంతయు నీదిక్కాడీని
యింతలో శ్రీవేంకటేశ నన్నేలితి
వింతటఁ బొగడే రిఁకనందరును

(||pallavi||)
nādŏ nem̐ṭigi nāḍagamu
ghādalane ninum̐ gādanenā

(||nādo||)
lalanagu nīmovi laṁchamiyyam̐gā
paligī nichchalu palumāru
palu nīsuddulu parula naḍugumā
tĕliberaṁdaru tĕllamigānu

(||nādo||)
maguvasannum̐gava mari nīvaṁṭam̐ga
mŏgamoḍamule muṁchīnide
agu nīsedalu aṁdari naḍugumā
tagavainaṭlanĕ talam̐piṁcheru

(||nādo||)
yiṁtim̐ gām̐giḍanu yiḍu nīvĕnayam̐ga
aṁtayu nīdikkāḍīni
yiṁtalo śhrīveṁkaḍeśha nannelidi
viṁtaḍam̐ bŏgaḍe rim̐kanaṁdarunu