Naado nemi sepperu naadagabu mee suddulu

నాతో నేమి చెప్పేరు నాటకపు మీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
నాతో నేమి చెప్పేరు నాటకపు మీ సుద్దులు
నీతితో మిమ్ము మట్టున నిలపేనా నేఁను???

(॥నాతో॥)
యెగసక్కెపు మాటలు మీరిద్దరు నాడుకోఁగా
తగవులు చెప్పేనా దండ నే వుండి
అగపడి పెట్టరాని ఆనలెల్లాఁ బెట్టుకోఁగా
మగటిమి మెరసి నే మానిపేనా మిమ్మును

(॥నాతో॥)
పైకొని మీరిద్దరును బాసలు చేసుకొనఁగా
సాకిరై నే నుండేనా సందుసుడిని
వాకులు దెరచి లోలో వావులు దెలుపుకోఁగా
ఆకడీకడనుండి మిమ్మౌఁగాదనగలనా

(॥నాతో॥)
కలసి యాకె నీవుఁ గడు నివ్వెరగందఁగా
యెలమి నే గోర నొత్తి యెచ్చరించేనా
అలమి శ్రీ వేంకటేశ అట్టె నన్ను నేలితివి
బలిమిచేసి నేను పంతము లాడేనా

(||pallavi||)
nādo nemi sĕpperu nāḍagabu mī suddulu
nīdido mimmu maṭṭuna nilabenā nem̐nu???

(||nādo||)
yĕgasakkĕbu māḍalu mīriddaru nāḍugom̐gā
tagavulu sĕppenā daṁḍa ne vuṁḍi
agabaḍi pĕṭṭarāni ānalĕllām̐ bĕṭṭugom̐gā
magaḍimi mĕrasi ne mānibenā mimmunu

(||nādo||)
paigŏni mīriddarunu bāsalu sesugŏnam̐gā
sāgirai ne nuṁḍenā saṁdusuḍini
vāgulu dĕrasi lolo vāvulu dĕlubugom̐gā
āgaḍīgaḍanuṁḍi mimmaum̐gādanagalanā

(||nādo||)
kalasi yāgĕ nīvum̐ gaḍu nivvĕragaṁdam̐gā
yĕlami ne gora nŏtti yĕchchariṁchenā
alami śhrī veṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
balimisesi nenu paṁtamu lāḍenā