నాతో నేమి నవ్వేవు నడుమ నే వద్దనేనా
(॥పల్లవి॥)
నాతో నేమి నవ్వేవు నడుమ నే వద్దనేనా
కాతరాన నియ్యరాదా కప్పురబాగాలు
(॥నాతో॥)
వేడుకకు వెలలేదు వేసాలకు గురిలేదు
ఆడవయ్యా మాటలెల్లా ఆపెతోడను
వాడిక రట్టెఱఁగదు వలు సిగ్గెఱఁగదు
చూడరాదా ఆపెమోము సూటిదప్పకుండాను
(॥నాతో॥)
పాయము తప్పించదు భావము కొంచమెంచదు
సేయవయ్యా ఆపెదద్ద సేఁతలెల్లాను
కాయము తనివందదు గర్వము భయమందదు
వేయరాదా పందె మాపె వేయుమన్నట్టెల్లాను
(॥నాతో॥)
కోరిక చాయకు రాదు గుణము కొనితేరాదు
చేరవయ్యా రతి కాపె చిత్తము రాను
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మేరమీరకుండరాదా మెచ్చినందాఁకాను
(||pallavi||)
nādo nemi navvevu naḍuma ne vaddanenā
kādarāna niyyarādā kappurabāgālu
(||nādo||)
veḍugagu vĕlaledu vesālagu guriledu
āḍavayyā māḍalĕllā ābĕdoḍanu
vāḍiga raṭṭĕṟam̐gadu valu siggĕṟam̐gadu
sūḍarādā ābĕmomu sūḍidappaguṁḍānu
(||nādo||)
pāyamu tappiṁchadu bhāvamu kŏṁchamĕṁchadu
seyavayyā ābĕdadda sem̐talĕllānu
kāyamu tanivaṁdadu garvamu bhayamaṁdadu
veyarādā paṁdĕ mābĕ veyumannaṭṭĕllānu
(||nādo||)
koriga sāyagu rādu guṇamu kŏniderādu
seravayyā radi kābĕ sittamu rānu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
meramīraguṁḍarādā mĕchchinaṁdām̐kānu