నాతో నేలానవెట్టేరే నడుమ మీరు
(॥పల్లవి॥)
నాతో నేలానవెట్టేరే నడుమ మీరు
యీతల నాతనిసేఁత లెఱఁగనా నేను
(॥॥)
కడుబత్తిగలవాడు కడల కేలపోవునే
వొడయఁడై నావద్దనే వుండుఁగాక
వుడివోక మీరెంత వొడఁబరచేరే నన్ను
యెడనెడ తనగుట్టు యెరఁగనా నేను
(॥॥)
బాసలిచ్చినట్టివాఁడు పరుల నేల చూచునే
సేసవెట్టి కాఁపురము సేసుఁగాక
వేసరక మీరేల వేఁడుకొనేరే నన్ను
యీ సుద్దు లన్నియు ముందే యెరఁగనా నేను
(॥॥)
చేరి కూడినట్టివాఁడు సిగ్గులేల నెరపునే
వూరకే లోనై మరిగుండుఁగాక
మీరెల్లా శ్రీ వేంకటేశు మెచ్చి యేలపొగడేరే
యీరీతిజాణఁ డవుత యెఱఁగనా నేను
(||pallavi||)
nādo nelānavĕṭṭere naḍuma mīru
yīdala nādanisem̐ta lĕṟam̐ganā nenu
(||||)
kaḍubattigalavāḍu kaḍala kelabovune
vŏḍayam̐ḍai nāvaddane vuṁḍum̐gāga
vuḍivoga mīrĕṁta vŏḍam̐barasere nannu
yĕḍanĕḍa tanaguṭṭu yĕram̐ganā nenu
(||||)
bāsalichchinaṭṭivām̐ḍu parula nela sūsune
sesavĕṭṭi kām̐puramu sesum̐gāga
vesaraga mīrela vem̐ḍugŏnere nannu
yī suddu lanniyu muṁde yĕram̐ganā nenu
(||||)
seri kūḍinaṭṭivām̐ḍu siggulela nĕrabune
vūrage lonai mariguṁḍum̐gāga
mīrĕllā śhrī veṁkaḍeśhu mĕchchi yelabŏgaḍere
yīrīdijāṇam̐ ḍavuda yĕṟam̐ganā nenu