నాతో దాఁచక చెప్పవే నాతిరో నీవు
(॥పల్లవి॥)
నాతో దాఁచక చెప్పవే నాతిరో నీవు
యీ తనువు సోఁకినవాఁ డెంతభాగ్యవంతుఁడే
(॥నాతో॥)
చక్కనివెన్నెలవూట సతి నీనవ్వులతేట
మొక్కులలోని మొఱఁగు మోవితెఱఁగు
రెక్కతుమ్మిదలవొప్పు నిక్కిననీపెద్దకొప్పు
యిక్కువ నిన్నేలినవాఁడెంతభాగ్యవంతుఁడే
(॥నాతో॥)
అలచందురునిదీము అతివనీ నెమ్మోము
కలువలమైబాగులు కన్నుసోగలు
లలి శంకముకులము లక్షణపునీగళము
యిల నీమగఁడైనవాఁ డెంతభాగ్యవంతుఁడే
(॥నాతో॥)
నిరతిఁ గొండపొడవు నీచన్నులవడువు
మరునికొలువు నీమర్మపు నిలువు
సిరులఁ గూడె నిన్నట శ్రీవేంకటేశుఁడట
యిరవై నీవుగలవాఁ డెంతభాగ్యవంతుఁడే
(||pallavi||)
nādo dām̐saga sĕppave nādiro nīvu
yī tanuvu som̐kinavām̐ ḍĕṁtabhāgyavaṁtum̐ḍe
(||nādo||)
sakkanivĕnnĕlavūḍa sadi nīnavvuladeḍa
mŏkkulaloni mŏṟam̐gu movidĕṟam̐gu
rĕkkadummidalavŏppu nikkinanībĕddagŏppu
yikkuva ninnelinavām̐ḍĕṁtabhāgyavaṁtum̐ḍe
(||nādo||)
alasaṁdurunidīmu adivanī nĕmmomu
kaluvalamaibāgulu kannusogalu
lali śhaṁkamugulamu lakṣhaṇabunīgaḽamu
yila nīmagam̐ḍainavām̐ ḍĕṁtabhāgyavaṁtum̐ḍe
(||nādo||)
niradim̐ gŏṁḍabŏḍavu nīsannulavaḍuvu
marunigŏluvu nīmarmabu niluvu
sirulam̐ gūḍĕ ninnaḍa śhrīveṁkaḍeśhum̐ḍaḍa
yiravai nīvugalavām̐ ḍĕṁtabhāgyavaṁtum̐ḍe